BREAKING
పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి :వైద్యాధికారిని హైమశ్రీ అక్షర సాధన తో అధిరోహించిన శిఖరం పోలీసుల విధులపై చిన్నారులకు అవగాహన సిబ్బంది సేవలు వెలకట్టలేనివి ప్రభుత్వమే పత్తిని కొనుగోలు చేయాలి జిల్లా పరిషత్ చైర్మన్ బి సి అయితే..మాకు అవకాశం ఇవ్వండి.. : చింతా శంకర్ మూర్తి.. ఈవో వర్సెస్.. చైర్మన్ వాడిగా వేడిగా కనకమహాలక్ష్మి ట్రస్ట్ బోర్డు సమావేశం వేయి స్తంభాల దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు బీటెక్ విద్యార్థి ఆత్మహత్య మెరిసే అందమైన చర్మం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు? పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన బాల్యం, బాలికల విద్యకు ప్రాధాన్యమివ్వాలి.. లింగ వివక్షకు తావులేదు ఢిల్లీలో ఉద్రిక్తత: రాహుల్ గాంధీ అదుపులోకి, సంఘీభావానికి వెళ్లిన సీఎం రేవంత్‌ను అడ్డుకున్న పోలీసులు మైనారిటీ గురుకులంలో విద్యార్థిపై దాడి ఆరోపణ జిల్లా పొలిటికల్ అవేర్‌నెస్ చైర్‌పర్సన్‌గా సుదా గణపతి.. రాష్ట్ర స్ట్రాంగ్ మెన్ టైటిల్ విజేత మారే వీరేంద్ర…

ఉపాధ్యాయురాలికి జిల్లాస్థాయి గౌరవం

Select Suryaa Now
ఉపాధ్యాయురాలికి జిల్లాస్థాయి గౌరవం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

గోపాలపురం మండలం రాజంపాలెంలోని నవోదయ ఆంగ్ల మాధ్యమ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తున్న షేక్ ఖాదర్ బికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలి పురస్కారం లభించింది. రాజమహేంద్రవరం శాంతినగర్‌లోని వాణిజ్య మండలి సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాల సంఘం తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆమెను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా రాజమహేంద్రవరం నగర శాసనసభ్యుడు ఆదిరెడ్డి శ్రీనివాసు, కొవ్వూరు డివిజన్ ఉప విద్యాశాఖాధికారి ఏ. తులసీదాస్ చేతుల మీదుగా షేక్ ఖాదర్ బి ప్రశంసాపత్రం అందుకున్నారు. మూడు దశాబ్దాలుగా విద్యారంగంలో సేవలందిస్తూ విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు జీవన, నైతిక విలువలను బోధిస్తున్నందుకు ఆమెను అభినందించారు.

వెనుకబడిన ప్రాంతాలకు చెందిన బాలబాలికలకు విద్యను అందించడంలో ఆమె చేస్తున్న కృషి ప్రశంసనీయమని అతిథులు పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.

కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పి. కళ్యాణ్‌రెడ్డి, కార్యదర్శి పి. రామకృష్ణరాజు, కోశాధికారి పి. సురేష్ తదితరులు పాల్గొన్నారు.