కరువు అంచనాలు కాదు.. రైతుకు తక్షణ భరోసా కావాలి:చినుకని శివ ప్రసాద్
చౌటుప్పల్, మేజర్ న్యూస్:తెలంగాణలో కరువు పరిస్థితులపై ప్రభుత్వం అంచనాలు ప్రారంభించిన నేపథ్యంలో క్షేత్రస్థాయి పంట నష్టం అంచనాలను మరింత వేగవంతం చేయాలి అని డా. చినుకని శివ ప్రసాద్ కోరారు.
ప్రాథమిక నివేదికలతో సరిపెట్టకుండా ప్రతి ప్రభావిత మండలంలో రైతు వారీగా వాస్తవ పంట నష్టాన్ని నమోదు చేయాలి అన్నారు.
పంట నష్టపోయిన రైతులకు పరిహారం, రుణ ఉపశమనం, పశుగ్రాసం, తాగునీరు, తదుపరి సాగుకు విత్తనాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు.
కౌలు రైతులను కూడా నష్టపరిహార ప్రక్రియలో సముచితంగా గుర్తించాలి.
“కరువు నివేదిక వచ్చే వరకు రైతు ఎదురుచూసే పరిస్థితి ఉండకూడదు. అంచనా ఒక ప్రక్రియ మాత్రమే.. రైతుకు చేరే సహాయమే అసలు ఫలితం. ప్రభుత్వం కాలపరిమితితో కూడిన రైతు ఉపశమన కార్యాచరణను ప్రకటించాలి” అని డా. చినుకని శివ ప్రసాద్ అన్నారు.