పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గంటా
- అనంతుని ఆలయంలో వరుని యాగం
- రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ
- ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాల పంపిణీ
పద్మనాభం: పద్మనాభం మండలంలో స్థానిక ఎమ్మెల్యే పలు కార్యక్రమాలలో పాల్గొనడం జరిగినది. ముందుగా గంటా శ్రీనివాసరావు అనంతపద్మనాభ స్వామి ఆలయ ప్రాంగణంలో గల కుంతీ మాధవస్వామి ఆలయంలో తలపెట్టిన వరుణ యాగంలోని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయంలో వరుణ జపం , వరుణ యాగం , పూర్ణాహుతి చేసిన అనంతరం గోస్తని నదిలో తీసుకొని వచ్చిన గంగా జలాన్ని నారాయనేశ్వర స్వామి ఆలయంలో శివలింగానికి అభిషేకం చేయడం జరిగినది.ఈ కార్యక్రమం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. మండలంలోని గంధవరం, అనంతవరం, కొవ్వాడ గ్రామాల రైతులకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్థానిక మండల కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ 13 రకాల భద్రత ప్రమాణాలతో పాస్ పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు. మండలంలో 3,252 పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. వివాదాలకు తావు లేని విధంగా రైతుల ఆమోదంతోనే పాస్ పుస్తకాలను జారీ చేయడం సహా లోపాలను సరి చేస్తున్నామని వివరించారు. ఇనాం భూముల సమస్యకు తొందర్లోనే పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ హయంలో జగన్మోహన్ రెడ్డి స్వలాభంతో రెవిన్యూ వ్యవస్థను అస్తవ్యస్తంగా చేశారని విమర్శించారు. అనంతరం ఇళ్ల నిర్మాణం కొరకు మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేయడం జరిగినది. పి ఎం ఏ వై అర్బన్ -బి ఎల్ సి స్కీం లో 2.O హౌసింగ్ స్కీమ్ లబిడారులకు 251 మంధికి మంజూరు పత్రాలు పంపిణీ చేయడం జరిగినది. పథకం యూనిట్ కాస్ట్ 289000/- . కార్యక్రమంలో ఎమ్మార్వో శైలజ, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కురుమిన రామస్వామి నాయుడు, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.సూరిబాబు , డి ఈ వి.రామకృష్ణ మరియు ఏ ఈ ఆర్.పద్మజ , వర్క్ ఇన్స్పెక్టర్లు ఢిల్లీశ్వరరావు కరుణాకర్ , కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, కోరాడ రమణ, కసిరెడ్డి దామోదరరావు, మాజీ టిడిపి మండల అధ్యక్షులు కాళ్ల నగేష్ కుమార్, రామరాజు, కురుమిన లీలావతి, కాళ్ల సత్యనారాయణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.