BREAKING
పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి :వైద్యాధికారిని హైమశ్రీ అక్షర సాధన తో అధిరోహించిన శిఖరం పోలీసుల విధులపై చిన్నారులకు అవగాహన సిబ్బంది సేవలు వెలకట్టలేనివి ప్రభుత్వమే పత్తిని కొనుగోలు చేయాలి జిల్లా పరిషత్ చైర్మన్ బి సి అయితే..మాకు అవకాశం ఇవ్వండి.. : చింతా శంకర్ మూర్తి.. ఈవో వర్సెస్.. చైర్మన్ వాడిగా వేడిగా కనకమహాలక్ష్మి ట్రస్ట్ బోర్డు సమావేశం వేయి స్తంభాల దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు బీటెక్ విద్యార్థి ఆత్మహత్య మెరిసే అందమైన చర్మం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు? పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన బాల్యం, బాలికల విద్యకు ప్రాధాన్యమివ్వాలి.. లింగ వివక్షకు తావులేదు ఢిల్లీలో ఉద్రిక్తత: రాహుల్ గాంధీ అదుపులోకి, సంఘీభావానికి వెళ్లిన సీఎం రేవంత్‌ను అడ్డుకున్న పోలీసులు మైనారిటీ గురుకులంలో విద్యార్థిపై దాడి ఆరోపణ జిల్లా పొలిటికల్ అవేర్‌నెస్ చైర్‌పర్సన్‌గా సుదా గణపతి.. రాష్ట్ర స్ట్రాంగ్ మెన్ టైటిల్ విజేత మారే వీరేంద్ర…

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యం

Select Suryaa Now
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

రాబోయే స్థానిక సంస్థల (పంచాయతీ) ఎన్నికల నేపథ్యంలో అంబాజీపేట బస్టాండ్ సెంటర్ నుండి పి.గన్నవరం సర్కిల్ పోలీసులు సోమవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

పి.గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్.భీమరాజు ఆధ్వర్యంలో అంబాజీపేట సెంటర్లో కాలినడకన ఈ ఫ్లాగ్ మార్చ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లు ఎస్ కె సుభాని, ఈ నరసింహమూర్తి, ఏ ఎస్ ఐ లు , పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఐ ఆర్.భీమరాజు మాట్లాడుతూ రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలి. సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన  అంబాజీపేట మండలంలో గంగలకుర్రు,మాచవరం, ఇసుకపూడి, చిరుతపూడి,పి.గన్నవరం మంలడంలో పప్పులవారిపాలెం (కుందాలపల్లి), బెల్లంపూడి, ఉడుమూడి గ్రామాల్లో ప్రత్యేకంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తాం. ప్రజలు ఎలాంటి భయం లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఎన్నికల నియమావళిని పాటించాలని అవగాహన కల్పించారు.