స్థానిక సంస్థల ఎన్నికలకు స్ట్రాంగ్ రూమ్ పరిశీలన
- ఎంపీడీవో నడిమింటి సూర్యనారాయణ వెల్లడి
- తహసిల్దార్ పాము బాల,ఏవో ఎన్ అర్జున్ రావు
గరుగుబిల్లి: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సామాగ్రి బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల అధికారులు మంగళవారం స్ట్రాంగ్ రూమును పరిశీలించారు.ఈ మేరకు గరుగుబిల్లి మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటుకు సంబంధించి పరిశీలించడం జరిగిందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి నడిమింటి సూర్యనారాయణ స్పష్టం చేశారు.స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సామాగ్రి బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాలలో స్ట్రాంగ్ రూము ఏర్పాటుకు పరిశీలించామన్నారు.స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటుపై ఉన్నతాధికారులకు నివేదిక పంపించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీల పరిధిలో పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలకు సంబంధించి పరిశీలన చేయడం జరిగిందన్నారు.ఈపరిశీలనలో మండల తహసిల్దార్ పాము బాల ఎంపీడీవో కార్యాలయం ఏవో ఎన్ అర్జున్ రావు,బెంకిలి శ్రీనివాసరావు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపాల్ అరసాడ రజనీకుమారి, స్థానిక పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎన్ రాము తదితరులు పాల్గొన్నారు.