BREAKING
విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా వేడుకలకు కేంద్ర రైల్వే మంత్రికి ఆహ్వానం బ్రస్సెల్స్ విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రద్దుకు ఏర్పాట్లు ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

శ్రీ కోటదుర్గ ఆలయం లో గోడ పత్రిక విడుదల

Select Suryaa Now
శ్రీ కోటదుర్గ ఆలయం లో గోడ పత్రిక విడుదల

పాలకొండ: ఉత్తరాంధ్ర ఇలవేల్పు, భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లి పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి వేడుకల గోడపత్రికను ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, సీనియర్ నాయకులు పల్లా కొండలరావు,గంటా సంతోష్, కొండదడి  రాజేష్ ఆలయ ఈఓ సూర్యనారాయణతో కలిసి ఆవిష్కరించారు. పాలకొండ అతిపెద్ద వేడుక అయిన అమ్మవారి దసరా నవరాత్రులను అత్యంత వైభవోపేతంగా భక్తి శ్రద్దలతో ప్రతి ఏడాది నిర్వహించడం అనవాయితీగా వస్తుందని ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా ఎంతో ఘనంగా నిర్వహించనున్నామని ఎమ్మెల్యే జయకృష్ణ తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందేవిధంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేందుకు ప్రణాళికలు రూపొందించామని సీనియర్ నాయకులు పల్లా కొండలరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు , బలివాడ శ్రీధర్, బోగాది వెంకటరమణ, పడాల రాంబాబు, కోరికాన గంగునాయుడు కుమార్ రాజా దుప్పాడ రమణ దావాల రమణారావు, సారిపల్లి సంతోష్ కుమార్ మరియు ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు.