పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన
పాలకొండ: పాలకొండశ్రీ కోట దుర్గ అమ్మ వారి ఆలయంలో ఈ నెల 10 నుంచి దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవ ఏర్పాట్లను సీఐ ప్రసాద్ రావు మంగళవారం పరిశీలించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన సూచించారు. నిజరూప దర్శనానికి వచ్చే యాత్రికుల సంఖ్యపై దేవదాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్య నిర్వాహక అధికారి వి.వి. సూర్య నారాయణ, ఎస్సై వెంకన్న, జనసేన నాయుకులు కొండదాడి రాజేష్,ప్రశాంత్, నీలాపు శ్రీనివాస రావు పాల్గొన్నారు.