బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటర్ల హెల్ప్ డెస్క్ ప్రారంభం*
నాగారం, మేజర్ న్యూస్:
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ నాగారం మండల అధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య పిలుపునిచ్చారు.తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు నాగారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘పట్టభద్రుల ఓటర్ల హెల్ప్ డెస్క్’ను మంగళవారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫాం-18 ద్వారా ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల పరిధిలోని నివాసులై ఉండి, 2023 నవంబర్ నాటికి డిగ్రీ లేదా దానికి సమానమైన డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు, మేధావులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల బి ఆర్ ఎస్ పార్టీ అధికారిప్రతినిధి చిల్లర చంద్రమౌళి మాజీ ఎంపీపీ కూరం మణి వెంకన్న మండల యూత్ అధ్యక్షులు ఈదుల కిరణ్ కుమార్ యారాల నరసింహారెడ్డి మంచినీళ్ళ మహేందర్ గ్రామ శాఖ అధ్యక్షులు కన్నెబోయిన మల్లేష్ పేరాల నవీన్ దర్శనం శేఖర్ ఎర్ర నరేష్ జోష్ సురేష్ రెడ్డి సునీల్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.