BREAKING
విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా వేడుకలకు కేంద్ర రైల్వే మంత్రికి ఆహ్వానం బ్రస్సెల్స్ విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రద్దుకు ఏర్పాట్లు ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో వరుణయాగం

Select Suryaa Now
శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో వరుణయాగం

పాలకొండ: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు పాల కొండలోని శ్రీ కోట దుర్గమ్మతల్లి దేవస్థానం ఆధ్వర్యంలో వరుణయాగం, వరుణజపం, ఋష్య శృంగ ఆరాధన మహోత్సవాన్ని మంగళ వారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో వి.వి. సూర్యనారాయణ పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు లక్ష్మీ ప్రసాద్ శర్మ,అర్చకులు మణీల్ శర్మ, చక్రధర్సాహు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. టీడీపీ ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, పాలకొండ నియోజకవర్గ ఇన్చార్జి పడాల భూదేవి, మండల అధ్యక్షుడు గండి రామినాయుడు, టౌన్ అధ్యక్షుడు గుమ్మడి సింహాద్రి, మజ్జి జయశంకర్ తదితరులు కోటదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిం చారు. అనంతరం మండపంలో నిర్వహించిన వరుణయాగంలో పాల్గొన్నారు. సీనియర్ మహిళా నేత బొమ్మలాట స్వర్ణరాణి, బిడ్డిక జయలక్ష్మి, శాసపు సర్వారావు, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస శర్మతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.