అయోడిన్ లోపంతో పిల్లల ఎదుగుదలపై ప్రభావం
- ఆహారంలో అయోడైజ్డ్ ఉప్పు నే వినియోగించాలి
- ఎన్.ఐ.డి.డి.సి.పి సర్వే పరిశీలన : డి.ఎం.హెచ్.ఓ
పార్వతీపురం రూరల్: అయోడిన్ లోపంతో పిల్లల్లో మానసిక, శారీరక అభివృద్ధిపై ప్రభావం పడుతుందని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా పి. విజయలక్ష్మి అన్నారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా అయోడిన్ లోప వ్యాదుల నియంత్రణ కార్యక్రమం సర్వే నిర్వహించారు. కార్యక్రమ నోడల్ అధికారి, ఎన్.సిడి పిఓ డా టి. జగన్ మోహనరావు తో కలిసి చినబొండపల్లి ప్రాధమిక పాఠశాలలో సర్వే ను పరిశీలించారు. అయోడిన్ పరీక్షల కొరకు సేకరించిన శాంపిల్స్, వాటి వివరాలు పరిశీలించారు. పిల్లలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత , మెదడు అభివృద్ధి , నేర్చుకునే సామర్థ్యానికి మానసిక, శారీరక ఎదుగుదలకు అయోడిన్ శరీరంలో తగు పరిమాణంలో ఉండాలని డిఎంహెచ్ఓ తెలిపారు. ఆహారంలో అయోడైజ్డ్ ఉప్పు నే వాడాలని సూచించారు. డా. జగన్ మోహన్ మాట్లాడుతూ పిల్లల్లో అయోడిన్ శాతం ఏ మోతాదులో ఉంటుందో నిర్ధారణ చేసేందుకు సర్వే చేపట్టి శాంపిల్స్ సేకరించడం జరిగిందన్నారు. థైరాయిడ్ సమస్యలు తలెత్తకుండకుండా ముందస్తు చర్యలు గా ని డి డి సి పి కార్యక్రమo జిల్లాలో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డా. సూర్య కౌశిక్ , వైద్యాధికారి డా. జి. గోపాల కృష్ణ , హెచ్ఎం సతీష్ కుమార్, డెమో ప్రసాద్, సూపర్వైజర్ శంకర్ , వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.