BREAKING
విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా వేడుకలకు కేంద్ర రైల్వే మంత్రికి ఆహ్వానం బ్రస్సెల్స్ విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రద్దుకు ఏర్పాట్లు ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

మండల విద్యాశాఖ అధికారులకు ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించిన డీఈవో

Select Suryaa Now
మండల విద్యాశాఖ అధికారులకు ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించిన డీఈవో

సీతానగరం: పార్వతీపురం మన్యం జిల్లా కేపీఎం హైస్కూల్లో సహిత విద్య పైన  పార్వతీపురం మన్యం జిల్లాలో మండల విద్యాశాఖ అధికారులకు ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం జిల్లా విద్యాశాఖ అధికారి పి బ్రహ్మాజీ రావు  ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సహిత విద్య పైన ప్రతి ఒక్క మండల విద్యాశాఖ అధికారులకు అవగాహన కల్పించేటట్లుగా సాహిత్య విద్య అంటే ఏమిటి ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి ఉన్నటువంటి రాయితీలు మినహాయింపులు, చట్టాలు అలాగే ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఎటువంటి అడ్డంకులు లేకుండా మంచి వాతావరణం కల్పించాలని వీరికి శిక్షణా కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది. అలాగే సమగ్ర శిక్షలో ప్రత్యేక అవసరాలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల మీద రివ్యూ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రత్యేక అవసరాలు గలిగిన 10వ తరగతి విద్యార్థుల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి వారికి రాయితీలు స్కైబ్ మొదలైన విషయాలు మీద అవగాహన కల్పించడం జరిగింది దీనిలో భాగంగా ప్రశస్త ఆప్ కోసం కూడా అన్ని వివరాలు వారికి తెలియజేయడం జరిగింది. అలాగే సహిత విద్య టిపిడి కోర్స్  కోసం కూడా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా ఏపీసీ B.రాజ్ కుమార్ గారు సహిత  విద్య    కోఆర్డినేటర్ పి. భాను మూర్తి ,ఈ ఒక్కరోజు శిక్షణా కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా  రాయిడి శంకర రావు. కే. జగన్ మోహన్ రావు. మరియు  ఐ ఈ టీపీడీ కోర్స్ కోఆర్డినేటర్ కోటి. చిరంజీవి అన్ని మండలాల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.