మాయూనియన్ విజయం సాధిస్తుంది
యాదగిరిగుట్ట మేజర్ న్యూస్....
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల హక్కులను కాలరాసి ఎన్నో నిర్బంధాలకు గురి చేసిందన్నారు. టి ఎం యు జనరల్ సెక్రటరీ అశ్వత్థామ రెడ్డి..గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను వేధింపులకు గురి చేసి పని భారాన్ని పెంచి కార్మికుల జీవితాలతోఅడుకుందన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఆర్టీసీ బస్ డిపో ఆర్టీసీ కార్మిక యూనియన్ ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న ఆయన ప్రతి ఒక్క ఆర్టీసీ కార్మికుడు బాణం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. టి డబ్ల్యూ యు, ఎస్ డబ్ల్యూ ఎఫ్ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ కార్మికులకు రెండు వేతన సవరణలు జరిగాయని పేర్కొన్నారు. దాంతో పాటు పి ఎఫ్ బకాయిలు కూడా తొందరగా చెల్లించ్చిందన్నారు. డీఏ లు పెండింగ్ లేకుండా అందించారన్నారు. ఈ నెల 9 వ తేదీన ఆర్టీసీ కార్మిక యూనియన్ ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే ప్రభుత్వం లో ఆర్టీసీ విలీనం నూటికి నూరు శాతం జరుగుతుందని హామీ ఇచ్చారు. విలీనంతో పాటు సంపూర్ణ ఉద్యోగ భద్రత,భవిష్యత్ కు భరోసా కలుగుతుందన్నారు. ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాల కోసం యూనియన్ ఎన్నికల మానుపేస్టో లో అనేక అంశాలను చేర్చి ఎన్నికల రంగంలోకి దిగమన్నారు. ప్రతి ఒక్క ఆర్టీసీ కార్మికుడు ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తూచా తప్పకుండ అమలు చేస్తామన్నారు..ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనంతో పాటు పని భారం తగ్గించే విధంగా సంపూర్ణ పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో
యాదగిరిగుట్ట డిపో సెక్రటరీ జి ప్రభాకర్ రెడ్డి,
ఎస్ డబ్ల్యూ ఎఫ్ డిపో సెక్రటరీ ఎం కృష్ణయ్య,
వర్కింగ్ ప్రెసిడెంట్ ఏపి రెడ్డి, డిపో అధ్యక్షులు ప్రవీణ్, గ్యారేజీ సెక్రటరీ నర్సింగ్ రావు,మహిళా కార్యదర్శి లక్ష్మి బాయి,నాయకులుసత్తయ్య,జిఎన్రావు,జంగయ్య,బాస్కర్, రమణ, శ్రీనివాస్,రాము,పుష్పాలత,లింగం స్వామి,సుజాత,నగేష్, ఉమా కాంత్,నాగమణి,
సునీత, పారిజాత,పద్మ,తదితరులు పాల్లొన్నారు.