వరిలో ఎద పద్ధతితో సాగు ఖర్చు తగ్గుతుంది ... ఏవో ఎస్ అవినాష్.
సీతానగరం: వరిలో ఎదతో సాగు ఖర్చు తగ్గుతుందని మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్ అవినాష్ అన్నారు సీతానగరం మండలంలో గుచ్చిమి గ్రామంలో ఆత్మ సౌజన్యంతో మార్రపు నారాయణమ్మ పొలంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరిలో ఎద పద్ధతితో సాగు ఖర్చులు తగ్గింపు వివరించారు వరి సాగులో నారుమడి, నారు పీకడం, నాట్లు వేయడం వంటి పనులు లేకుండా నేరుగా విత్తనాలు విత్తే ఎద పద్ధతి ద్వారా సాగు ఖర్చులు, కూలీల అవసరాన్ని తగ్గించుకోవ వచ్చు అన్నారు ఎద పద్ధతిలో మంచి ఫలితాల కోసం పొలాన్ని సమతలంగా సిద్ధం చేసి, నాణ్యమైన విత్తనాలను శుద్ధి చేసి సిఫార్సు చేసిన మోతాదులో విత్తుకోవాలని సూచించారు. విత్తిన అనంతరం కలుపు యాజమాన్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, పంట ప్రారంభ దశలోనే కలుపును నియంత్రించాలని తెలిపారు. పంట అవసరానికి అనుగుణంగా నీటిని అందిస్తూ, పొలంలో నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా చూడాలని అధికారులు సూచించారు. అలాగే సిఫార్సు చేసిన పోషక యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన పంటను పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉద్యాన సహాయకులు, రైతులు పాల్గొన్నారు.