BREAKING
విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా వేడుకలకు కేంద్ర రైల్వే మంత్రికి ఆహ్వానం బ్రస్సెల్స్ విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రద్దుకు ఏర్పాట్లు ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

చిగురుకోట జడ్పీ హైస్కూల్ ను పరిశీలించిన ఎస్ఎంసి చైర్మన్ దండే లక్ష్మి

Select Suryaa Now
చిగురుకోట జడ్పీ హైస్కూల్ ను పరిశీలించిన ఎస్ఎంసి చైర్మన్ దండే లక్ష్మి

ముదినేపల్లి , మేజర్ న్యూస్ : మండలంలోని చిగురుకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎస్ఎంసి చైర్మన్ దండే లక్ష్మి సందర్శించి పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని తెలుసుకున్నారు. హైస్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను పరిశీలించి విద్యార్థులకు భోజనాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజనం మెనూ తప్పనిసరిగా అమలు చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందజేయాలని ఏమైనా సమస్యలుంటే తెలియజేయాలని కోరారు. పదవ తరగతి పరీక్షలలో నూరు శాతం ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అందుకు ఎస్ఎంసి తరఫున తమ వంతు సహకారం ఉంటుందని చైర్మన్ దండే లక్ష్మి తెలిపారు. హెచ్ఎం సుబ్బారావు , అధ్యాపకులు పాల్గొన్నారు.

 

 రిపోర్టర్ నాగరాజు ముదినేపల్లి ఏలూరు జిల్లా