telanagana
సైబర్ భద్రతపై అవగాహనే డిజిటల్ ప్రపంచానికి శ్రీరామరక్ష
Telanagana
06 Oct 2026
33 views
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి;ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఘనంగా 'సైబర్ సెక్యూరిటీ' పై వర్క్ షాప్ డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూనే అప్రమత్తంగా ఉండాలని వక్తలు పిలుపు మారుతున్న సాంకేతిక యుగంలో డిజిటల్ ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు, భద్రతా ప్రమాణాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రతిష్టాత్మక చర్యలు చేపట్టారు. కామారెడ్డిలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (స్వయంప్రతిపత్తి) కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ విభాగం ఆధ్వర్యంలో “సైబర్ సెక్యూరిటీ ప్రొటెక్టింగ్ డిజిటల్ వరల్డ్” అనే అంశంపై ఒక ప్రత్యేక కార్యశాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ కె. విజయకుమార్ అన్నారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన,కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. విజయకుమార్ దిశానిర్దేశం చేస్తూ... 'నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులు కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడమే సరిపోదు, దానితో పాటు సైబర్ సెక్యూరిటీ భద్రతా ప్రమాణాలు,ఆధునిక అంశాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవడం అత్యంత ముఖ్యం' అని ఉద్ఘాటించారు. సైబర్ భద్రతపై యువతకు అవగాహన ఉండటం సమాజ హితానికి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్‌గా విచ్చేసిన సీఈవో,సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ ఎక్స్పర్ట్, హైదరాబాద్ ప్రమీల్ అర్జున్ విద్యార్థులకు సైబర్ నేరాల తీరుతెన్నులు, వాటి నుంచి రక్షణ పొందే మార్గాలపై సమగ్ర అవగాహన కల్పించారు. అలాగే, ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా సైబర్ క్రైమ్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ బి. నరేష్ మాట్లాడుతూ, నేటి ఆధునిక కాలంలో సైబర్ నేరగాళ్ల మోసాల బారిన పడకుండా యువత ఎలా అప్రమత్తంగా ఉండాలో ఆచరణాత్మక ఉదాహరణలతో వివరించారు.అనంతరం ముఖ్య అతిథులకు హాజరైన శాలువా, జ్ఞాపకతో ఘనంగా సత్కరించారు ఈ కార్యశాలను విజయవంతంగా నిర్వహించిన కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ విభాగాన్ని ప్రిన్సిపాల్ ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.కిష్టయ్య భౌతిక శాస్త్రాల డీన్ డాక్టర్ మానస, డాక్టర్ జి. శ్రీనివాసరావు, డాక్టర్.దినకర్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ విభాగం అధిపతి డాక్టర్ బి. శారద, అధ్యాపకులు రాంప్రసాద్, అనిల్ కృష్ణ, దత్తు కుమార్, దేవెందర్ తో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ట్యాగ్లు:
Latest News