రైతులకు రుణాలు మంజూరు...
కొందుర్గు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు రెండు కోట్లకు పైగా రుణాలను గురువారం మంజూరు చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు తుమ్మలపల్లి జితేందర్ రెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ గొబ్రా నాయక్, డైరెక్టర్లు మానయ్య, జగన్ మోహన్ రెడ్డి,నంద కుమారి, రత్నమ్మ, మల్లేష్,వెంకటేష్, నారాయణ చారి, ఎజాజ్ అలీ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి గార్లతో కలిసి రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఈ బ్యాంకింగ్ వ్యవస్థ లేనప్పుడు పిఎసిఎస్ ద్వారానే రైతులు రుణాలు తీసుకునే వారని, రైతులకు ఎన్నో రకాలుగా సేవలందించేదని గుర్తు చేశారు. రుణాలు తీసుకున్న ప్రతి ఒక్కరు సకాలంలో చెల్లించాలని, ఆ రకంగా చెల్లిస్తేనే మిగతా రైతులకు రుణాలు మంజూరు చేయడానికి వెసులుబాటు ఉంటుందని తెలిపారు. రైతులకు అన్ని రకాలుగా సహకారం అందిస్తున్న సహకార సంఘాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీఈఓ నవీన్, మహమూద్, అశోక్ శ్రీధర్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
ఈ సత్యనారాయణ, మేజర్ న్యూస్, కొందుర్గ్.