మొగల్తూరు, సీతారాంపురంలలో పెన్షన్లు పంపిణీ చేసిన నాయకర్, రామరాజు
నరసాపురం రూరల్, మేజర్ న్యూస్ :మండలంలోని సీతారాంపురం సౌత్ రాజు గారి తోట గ్రామ పంచాయతీలలో రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ చేశారు. నగల్తూరులో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పొత్తూరి రామరాజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ప్రభుత్వ ఉద్దేశంతో ఒకటవ తారీఖున తెల్లవారుజాము నుండే పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వం కావడంతో ఒకటవ తారీఖున క్రమం తప్పకుండా అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో నేరుగా ముఖాముఖిగా మాట్లాడి, వారి సమస్యలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. నూతన వితంతు పెన్షన్లతో పాటు 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్లను లబ్ధిదారుల చేతికి స్వయంగా అందజేశారు.పెన్షన్లు అందజేసిన అనంతరం మాట్లాడుతూ.. "గత వైకాపా ప్రభుత్వ పాలనలో పెన్షన్ల పంపిణీ పేరిట ప్రజలు పడిన ఇబ్బందులను చూశాం.. నేడు మన కూటమి ప్రభుత్వంలో ఒకటో తేదీనే ఉదయాన్నే ఇంటి గడపకే వచ్చి అత్యంత గౌరవంగా పెన్షన్ అందిస్తున్న విధానాన్నీ చూస్తున్నాం" అని అన్నారు. అంతేకాకుండా, ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వారందరికీ 'తల్లికి వందనం' పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తూ విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన టిడిపి బిజెపి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఇజ్రాయిల్ నరసపూర్