BREAKING
టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన

అమరావతిలో నారా లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ , విజయనగరం జిల్లా పార్టీ పరిస్థితులపై చర్చ.

Select Suryaa Now
అమరావతిలో నారా లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ , విజయనగరం జిల్లా పార్టీ పరిస్థితులపై చర్చ.


 విజయనగరం అక్టోబర్ 1, మేజర్ న్యూస్:


విజయనగరం జిల్లాలో పార్టీ బలోపేతం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్, తెలుగుదేశం పార్టీ నేత మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), ఆయన కుమార్తె, తెలుగుదేశం పార్టీ యువ నాయకురాలు, ‘చిన్న శ్రీను సోల్జర్స్’ అధ్యక్షురాలు సిరమ్మ గురువారం సాయంత్రం అమరావతిలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితులు, సంస్థాగత అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై నారా లోకేష్‌తో వారు చర్చించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని నారా లోకేష్ సూచించినట్లు తెలిపారు.
జిల్లాలో పార్టీకి సంబంధించిన అంశాలపై జరిగిన ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని చిన్న శ్రీను, సిరమ్మ తెలిపారు.