చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి
బిజెపి రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి
చిన్నారుల భవిష్యత్తుకు పునాది వేయడంలో అంగన్‌వాడీ సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని బొక్క నర్సింహారెడ్డి అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజాప్రస్తానాన్ని పురస్కరించుకొని
“సేవా సంకల్ప్ అభియాన్”లో భాగంగా గురువారం కందుకూరు మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు నిమ్మ అంజిరెడ్డి ఆధ్వర్యంలో“అంగన్ మిలన్ సేవ” కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు చిన్నారుల విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం, సమగ్ర వికాసానికి అంగన్‌వాడీ సిబ్బంది అందిస్తున్న సేవలను అభినందించారు. సిబ్బందిని ఘనంగా సత్కరించారు.
చిన్నారుల చిరునవ్వులోనే దేశ భవిష్యత్తు దాగి ఉందని, వారి సమగ్ర వికాసం కోసం అంగన్‌వాడీ సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. “సేవే పరమావధి – దేశమే ప్రథమం” అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని నర్సింహా రెడ్డి పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు చిలుకల రఘునందన్, గౌర ప్రభాకర్, ముచ్చర్ల మాజీ ఎంపీటీసీ బక్క మల్లేష్, మండల ఉపాధ్యక్షులు ఇంద్రకంటి రవీందర్ గౌడ్, వెంకట్‌రెడ్డి, యువమోర్చా మండల అధ్యక్షుడు సామల దయాకర్‌రెడ్డి, మండల కార్యదర్శికుమ్మరి నర్సింహ, ఉపసర్పంచ్ లు నవీన్, తెరటి రవీందర్, చెన్నయ్య, కృష్ణగౌడ్, వెంకటేష్, అనిల్, మహేందర్, సాయి తదితరులు పాల్గొన్నారు.
- తోకల శ్రీనివాస్ :మేజర్ న్యూస్, కందుకూర్.