BREAKING
గాంధీ జయంతి రోజున ముంబైలో సీజేపీ నిరసన: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో రోడ్లపైకి జనం, పోలీసుల అనుమతి నిరాకరణ మధ్య ఉద్రిక్తత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు చెప్పేవి అబద్ధాలు: రాజమహేంద్రవరంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సవాల్, 100 సీట్ల హామీపై నిలదీత చీనాబ్ - అంజీ బ్రిడ్జిలపై తొలిసారి గంటకు 100 కి.మీ. వేగంతో వందే భారత్ రోజూ కాఫీ తాగుతున్నారా... లివర్‌పై దాని ప్రభావం ఇదే! పండ్లు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది? ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తినడంపై నిపుణుల సలహాలు! విద్యార్థుల కల నెరవేరింది... బిసి హాస్టల్ మెస్ చార్జీల పెంచిన ప్రభుత్వం -కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు -తిరుపతిలో సీఎం డిప్యూటీ సీఎం, మంత్రుల చిత్రపటాలకు పలాభిషేకం సిగ్మా మూవీ రివ్యూ.. జేసన్ సంజయ్ దర్శకత్వ ప్రతిభ, సందీప్ కిషన్ నటన మెప్పించాయా? బాక్సాఫీస్ వద్ద తగ్గిన నాని ది ప్యారడైజ్ జోరు.. గాంధీ జయంతి సెలవు దినాన కూడా కలెక్షన్లలో పతనం! వాయిదా పడిన ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ ఉడ్తా తిర్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ! జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఘనస్వాగతం పలికిన తులసి రామకృష్ణ కొడుకు సినిమా పోస్టర్‌ను గర్వంగా ప్రదర్శించిన తమిళనాడు సీఎం విజయ్.. మధురాంతకం రోడ్‌షోలో అరుదైన దృశ్యం! ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం కార్గిల్ నిజమైన హీరోలను కలిసిన సిద్ధార్థ్, అభయ్ వర్మ.. గోల్డెన్ యారోస్ వేడుకల్లో భావోద్వేగ క్షణాలు! గాంధీ ఆదర్శాలను నిత్యజీవితంలో అలవర్చుకోవాలి : అధ్యక్ష కార్యదర్శులు దివాకర్ రెడ్డి, పనబాక లక్ష్మి

తెలంగాణలో ప్రజా భద్రతకు డేటా ఆధారిత పోలీసింగ్‌ మరింత బలోపేతం చేయాలి: డా శివ ప్రసాద్

Select Suryaa Now
తెలంగాణలో ప్రజా భద్రతకు డేటా ఆధారిత పోలీసింగ్‌ మరింత బలోపేతం చేయాలి: డా శివ ప్రసాద్

తెలంగాణలో ప్రజా భద్రతకు డేటా ఆధారిత పోలీసింగ్‌ మరింత బలోపేతం చేయాలి: డా శివ ప్రసాద్ 

హైదరాబాద్: తెలంగాణలో నేరాల నియంత్రణకు పోలీసు శాఖ చేస్తున్న చర్యలను స్వాగతిస్తూనే, మారుతున్న నేర స్వరూపానికి అనుగుణంగా డేటా ఆధారిత, ప్రజాకేంద్రిత పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డా. చినుకని శివ ప్రసాద్ అన్నారు.

2023–24లో 2,65,377గా ఉన్న మొత్తం కేసులు 2025–26లో 2,84,363కు, 7.15% పెరిగాయి. ఇదే కాలంలో మాదకద్రవ్యాల కేసులు 2,026 నుంచి 2,960కు పెరగడం ప్రత్యేక ఆందోళనకర అంశమని తాజా పోలీసు క్రైమ్‌ రివ్యూ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అదే సమయంలో తీవ్రమైన నేరాలు, సైబర్‌ నేరాలు తగ్గినట్లు నివేదిక పేర్కొంది.

డ్రగ్స్‌, సైబర్‌ మోసాలు, మహిళలు–పిల్లల భద్రత, ట్రాఫిక్‌ నేరాలపై ప్రత్యేక కార్యాచరణ, ప్రతి ఫిర్యాదుపై వేగవంతమైన స్పందన, దర్యాప్తు పురోగతిపై పారదర్శక పర్యవేక్షణ, ఆధునిక సాంకేతికత వినియోగాన్ని మరింత పెంచాలని డా. శివ ప్రసాద్ కోరారు.

“పోలీసింగ్‌ అంటే కేవలం నేరం జరిగిన తర్వాత చర్య కాదు; నేరం జరగకుండా ముందస్తు నివారణ, బాధితుడికి సకాలంలో స్పందన, ప్రజల్లో భద్రతాభావం కల్పించడం కూడా అంతే ముఖ్యం. తెలంగాణలో ప్రజా నమ్మకాన్ని మరింత బలోపేతం చేసే పోలీసింగ్‌ అవసరం” అని ఆయన అన్నారు.