BREAKING
టిబెట్-నేపాల్ వరదలు: నేపాల్‌లో వేలమంది బలి బంగ్లాదేశ్‌లో దుర్గాపూజ ముంగిట ఉద్రిక్తత... ఇరాన్‌కు ఈ వారం సముద్రంలో చమురు లేదు, ఆదాయమూ లేదు: క్లోజింగ్ ఆక్షన్ సెషన్ సంప్రదింపుల పత్రంపై సెబీకి 20,000 అభిప్రాయాలు.., ఎఫ్&ఓ సెటిల్‌మెంట్ నిబంధనల్లో మార్పులపై ప్రతిపాదనలు అమలాపురంలో శ్రీ తేజా ఒకేషనల్ జూనియర్ కాలేజీ ప్రారంభం, విద్యార్థులకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పనిచేయాలని యాజమాన్యానికి సూచన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జీబీఆర్ కళాశాల విద్యార్థులు. మలికిపురంలో జరిగే ప్రజా నాట్యమండలి జిల్లా మహాసభలు జయప్రదం చేయాలి.. అనుమతులు ఘనం.. బిల్లులు శూన్యం బీవీసీలో భట్లపాలెం నందు యువజన ఉత్సవాలు.. గోవింద నామస్మరణతో మార్మోగిన వాడపల్లి వెంకన్న ఆలయం మోడరన్ హైస్కూల్ లో ఆకట్టుకున్న రోబోటిక్స్ శిక్షణా కార్యక్రమం నగరంలో అంగన్వాడి ఉత్సవ్ వేడుకలు సైన్స్ ఎగ్జిబిట్స్‌పై విద్యార్థుల్లో ఆసక్తి పెంపు. నేటి రాశి ఫలాలు: 4 అక్టోబర్ 2026, ఆదివారం.. నేటి పంచాంగం: 4 అక్టోబర్ 2026, ఆదివారం

విద్యార్థుల కల నెరవేరింది... బిసి హాస్టల్ మెస్ చార్జీల పెంచిన ప్రభుత్వం -కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు -తిరుపతిలో సీఎం డిప్యూటీ సీఎం, మంత్రుల చిత్రపటాలకు పలాభిషేకం

Select Suryaa Now
విద్యార్థుల కల నెరవేరింది... బిసి హాస్టల్ మెస్ చార్జీల పెంచిన ప్రభుత్వం -కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు -తిరుపతిలో సీఎం డిప్యూటీ సీఎం, మంత్రుల చిత్రపటాలకు పలాభిషేకం

బీసీ హాస్టల్ విద్యార్థుల చిరకాల డిమాండ్ నెరవేరింది. మెస్ చార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 18 విడుదల చేయడంతో విద్యార్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఉప్పర నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 

బాలాజీ సర్కిల్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం బీసీ హాస్టల్ విద్యార్థులు సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ గత కొంతకాలంగా బీసీ హాస్టల్ విద్యార్థులు మెస్ చార్జీల పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో పాత చార్జీలతో భోజనం కష్టంగా మారింది. ఈ విషయాన్ని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. మా వినతిని సానుకూలంగా స్వీకరించి జీవో నంబర్ 18 ద్వారా మెస్ చార్జీలు పెంచిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రులు లోకేష్, సవితమ్మ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీసీ విద్యార్థుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండగా ఉందని, ఈ నిర్ణయం వేలాది మంది పేద బీసీ విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు గట్టు సురేష్, నెల్లూరు జిల్లా అధ్యక్షులు శీను, యూనివర్సిటీ ఇంచార్జ్ ఎజ్రా, ధనుష్, మధు, పలువురు బీసీ హాస్టల్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి