అనుమతులు ఘనం.. బిల్లులు శూన్యం
ఆత్రేయపురం మేజర్ న్యూస్ కూటమి ప్రభుత్వం పని పండుగ కార్యక్రమంలో పనులు చేపట్టిన గుత్తేదారులు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో లబోదిబోమంటున్నారు కూటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2024 ఆర్థిక సంవత్సరంలో పల్లె వెలుగు కార్యక్రమం చేపట్టింది. ఈ పథకంలో భాగంగా గ్రామాల్లో సిసి రోడ్లు డ్రైనేజీలు మ్యాజిక్ ట్రైన్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మాణాలు చేపట్టింది
అందుకుగాను ఇప్పటివరకు పల్లె వెలుగు 1, పల్లెవెలుగు 2, పల్లెవెలుగు 3 ద్వారా మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున శంఖు స్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఈ పనులుకు మెటీరియల్ సరఫరా చేసిన గుత్తేదారులు మాత్రం కూటమి ప్రభుత్వం సకాలంలో బిల్లలు అందక కోట్లాది రూపాయలు బిల్లులు పెండింగ్ పడి ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పటి వరకు రాష్ట్రం లోని 175 నియోజకవర్గలలో సుమారుగా 20 వేల కోట్ల రూపాయల పనులు పూర్తికాగా 11 వేల కోట్లు పనులకు ఇటీవల ప్రభుత్వం సాంకేతిక అనుమతులు మంజూరు చేసింది. పూర్తి అయినా 20 వేల కోట్ల పనులకు ప్రభుత్వం సుమారు 10 వేల కోట్లు బకాయిలు చెల్లించ వలసి ఉందని గుత్తేదారులు లబోదిబోమంటున్నారు. కూటమీ ప్రభుత్వం అధికారం వచ్చేందుకు పాటుపడిన కార్యకర్తలకే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ పనులు అప్పగించారు.
అయితే సకాలంలో మెటీరియల్ కు బిల్లులు చెల్లిస్తారని అధిక వడ్డీలకు రుణాలు తెచ్చి పల్లె వెలుగు కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమలు చేపట్టామని కానీ బిల్లులు రాకపోవడంతో తెచ్చిన రుణాలకు వడ్డీలు కట్టేందుకు సతమతం అవుతున్నామని గుత్తేదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా పల్లె వెలుగు కార్యక్రమం ద్వారా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు చెందిన బిల్లులు చెల్లించాలని వారు కోరుతున్నారు.