ఎంపీపీగా పదవీ విరమణ చేసిన గంగాభవాని.. వైఎస్ఆర్సిపి ఆత్మీయ సమ్మేళనం..
ముమ్మిడివరం మేజర్ న్యూస్ ఎంపీపీగా పదవీ విరమణ చేసిన కోలా గంగాభవాని ఆమె భర్త కోలా బాబ్జి లను వైసిపి నియోజకవర్గ కోఆర్డినేటర్, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఘనంగా సన్మానించారు. ఆదివారం గ్రామంలో గేదెలంక గ్రామంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం లో ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసి పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పితాని బాలకృష్ణ ,పెన్మెత్స జగ్గప్ప రాజు , కాశీ బాల మునికుమారి పెన్మెత్స చిట్టి రాజు , పెయ్యాల చిట్టిబాబు, కుడుపూడి శంకర్రావు కాశీ రామకృష్ణ, జగతా బాబ్జి , లతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.