రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జీబీఆర్ కళాశాల విద్యార్థులు.
అనపర్తి మేజర్ న్యూస్. 52వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూనియర్ అంతర్‌జిల్లా కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే తూర్పుగోదావరి జిల్లా బాలుర, బాలికల జట్ల ఎంపిక రాజమహేంద్రవరంలో తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ ఎంపికల్లో జీబీఆర్ జూనియర్ కళాశాలకు చెందిన ఐదుగురు బాలికలు, ఒక బాలుడు జిల్లా జట్లకు ఎంపికయ్యారు.
ఎంపికైన క్రీడాకారులు అక్టోబర్ 16 నుంచి 18 వరకు మార్కాపురం జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను జీబీఆర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ తేతలి ఆదిరెడ్డి (కొండబాబు), జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పి.ఆర్.ఎల్. స్వామి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.పి. అబ్బాయిరెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ మల్లీడి వీర వెంకట రామారెడ్డి (మహేంద్ర), పీఈటీలు కె. డేవిడ్ రాజు, టీ. విజయ్ బర్న అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.
వరల్డ్ స్పేస్ వీక్ పోటీల్లో జీబీఆర్ విద్యార్థినికి ప్రథమ స్థానం : వరల్డ్ స్పేస్ వీక్ పోటీల్లో జీబీఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పదో తరగతి విద్యార్థిని గొలుగూరి హాసిత మండలస్థాయి ప్రైవేట్బి పాఠశాలల విభాగంలో ప్రథమ స్థానం సాధించింది.ఈ సందర్భంగా జీబీఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ సెక్రటరీ, కరస్పాండెంట్ తేతలి ఆదిరెడ్డి (కొండబాబు), డీన్ జి. హరిప్రసాద్, హైస్కూల్ హెచ్‌ఎం రామారావు, ప్రైమరీ హెచ్‌ఎం భువనేశ్వరి, ప్రీ-ప్రైమరీ హెచ్‌ఎం కామాక్షి, ఏసీ క్యాంపస్ ప్రిన్సిపాల్ టీ. బుచ్చిరాజు, అకడమిక్ కో-ఆర్డినేటర్ ప్రశాంతిరెడ్డి, గైడ్ టీచర్ ఎన్. సురేష్ తదితరులు హాసితను అభినందించారు.మండల విద్యాశాఖ అధికారులు కూడా విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థిని భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.