BREAKING
టిబెట్-నేపాల్ వరదలు: నేపాల్‌లో వేలమంది బలి బంగ్లాదేశ్‌లో దుర్గాపూజ ముంగిట ఉద్రిక్తత... ఇరాన్‌కు ఈ వారం సముద్రంలో చమురు లేదు, ఆదాయమూ లేదు: క్లోజింగ్ ఆక్షన్ సెషన్ సంప్రదింపుల పత్రంపై సెబీకి 20,000 అభిప్రాయాలు.., ఎఫ్&ఓ సెటిల్‌మెంట్ నిబంధనల్లో మార్పులపై ప్రతిపాదనలు అమలాపురంలో శ్రీ తేజా ఒకేషనల్ జూనియర్ కాలేజీ ప్రారంభం, విద్యార్థులకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పనిచేయాలని యాజమాన్యానికి సూచన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జీబీఆర్ కళాశాల విద్యార్థులు. మలికిపురంలో జరిగే ప్రజా నాట్యమండలి జిల్లా మహాసభలు జయప్రదం చేయాలి.. అనుమతులు ఘనం.. బిల్లులు శూన్యం బీవీసీలో భట్లపాలెం నందు యువజన ఉత్సవాలు.. గోవింద నామస్మరణతో మార్మోగిన వాడపల్లి వెంకన్న ఆలయం మోడరన్ హైస్కూల్ లో ఆకట్టుకున్న రోబోటిక్స్ శిక్షణా కార్యక్రమం నగరంలో అంగన్వాడి ఉత్సవ్ వేడుకలు సైన్స్ ఎగ్జిబిట్స్‌పై విద్యార్థుల్లో ఆసక్తి పెంపు. నేటి రాశి ఫలాలు: 4 అక్టోబర్ 2026, ఆదివారం.. నేటి పంచాంగం: 4 అక్టోబర్ 2026, ఆదివారం

మలికిపురంలో జరిగే ప్రజా నాట్యమండలి జిల్లా మహాసభలు జయప్రదం చేయాలి..

Select Suryaa Now
మలికిపురంలో జరిగే ప్రజా నాట్యమండలి జిల్లా మహాసభలు జయప్రదం చేయాలి..

ఆలమూరు మేజర్ న్యూస్ ;కళ… కళ కోసం కాదు, ప్రజల చైతన్యం కోసమేనని నిరూపిస్తూ 1943 నుంచి ప్రజానాట్యమండలి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతోందని జిల్లా కన్వీనర్ వి. శామ్యూల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మణరావు తెలిపారు.శనివారం ఆలమూరులోని సమతా కార్యాలయంలో సీనియర్ కళాకారుడు సాయిబాబు అధ్యక్షతన ప్రజానాట్యమండలి ఆలమూరు మండల మహాసభ నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో అక్టోబర్ 24, 25 తేదీల్లో ప్రజానాట్యమండలి ప్రథమ జిల్లా మహాసభలు జరుగుతాయని వెల్లడించారు. అక్టోబర్ 24న యువత, మహిళల కోసం అభ్యుదయ పాటల శిక్షణా శిబిరం, 25న జిల్లా మహాసభ నిర్వహిస్తామన్నారు. దేశంలో పెరుగుతున్న విద్యార్థి, ప్రజా సమస్యలపై కళారూపాల ద్వారా చైతన్యం తెస్తామని, ఈ మహాసభలకు యువత, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు.

నూతన కమిటీ ఎన్నిక:మహాసభలో ఆలమూరు మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షుడిగా యేసురాజు,అధ్యక్షుడిగా కర్రి సాయిబాబు, కార్యదర్శిగా ఎన్.చంద్రరావు ఎంపికయ్యారు. కమిటీ సభ్యులుగా ఈశ్వరి, రమణయ్య, భవాని, వరలక్ష్మి, రవికుమార్, సహవాసరావులను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కళాకారులు యేసుదాసు,రామకృష్ణ, యాకోబు, పద్మ తదితరులు పాల్గొన్నారు.