మోడరన్ హైస్కూల్ లో ఆకట్టుకున్న రోబోటిక్స్ శిక్షణా కార్యక్రమం
రామచంద్రపురం మేజర్ న్యూస్ :స్థానిక ఎస్.ఎం.డి.జి.ఎం.డి. మోడరన్ హైస్కూల్ లో చుక్కారామయ్య స్పేస్ ప్రోగ్రాం అభ్యసిస్తున్న 90 మంది విద్యార్థులకు వారం రోజులపాటు మోడరన్ విద్యాసంస్థల ప్రాంగణంలో స్మార్ విక్స్ టెక్ అకాడమీ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ బేస్డ్ రోబోటిక్స్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్యక్రమ కోఆర్డినేటర్స్ పావులూరి సత్యరాజసాయి, కుడిపూడి రంజిత్ కుమార్ విద్యార్థులకు ఆసక్తికరంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ ప్రాధాన్యతను వివరించారు. రానున్న రోజుల్లో రోబోట్స్ యొక్క పాత్రను విద్యార్థులకు అర్థమయ్యేలా విశ్లేషించారు. ఈ సందర్భంగా తరగతి గదిలో ప్రదర్శించిన నమూనా రోబోట్ల ప్రదర్శన విద్యార్థులను అమితంగా ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా మోడరన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లయన్ జి.వి.రావు మాట్లాడుతూ... రేపటి భవిష్యత్తును ప్రతిబింబింపజేసే శాస్త్రీయ అంశాలను ఈరోజే తరగతి గదుల్లో బోధించాలనే కాన్సెప్ట్ తో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. అనంతరం హైస్కూల్ అకాడమిక్ డైరెక్టర్ ఆర్.ఉమాదేవి మాట్లాడుతూ…విద్యార్థులలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించేలా,అలాగే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ పట్ల అవగాహన కలిగించేలా ఈ తరహా క్లాసులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సత్యరాజ్ సాయి,రంజిత్ కుమార్ లను అధినేత జి. వి రావు ఆత్మీయంగా సత్కరించారు. కార్యక్రమంలో హెడ్మాస్టర్ ముత్యాల చిట్టిబాబు కోఆర్డినేటర్ వై.రాజు.సాయిరాం చౌదరి, సుధాకర్,పాల్గొన్నారు