BREAKING
టిబెట్-నేపాల్ వరదలు: నేపాల్‌లో వేలమంది బలి బంగ్లాదేశ్‌లో దుర్గాపూజ ముంగిట ఉద్రిక్తత... ఇరాన్‌కు ఈ వారం సముద్రంలో చమురు లేదు, ఆదాయమూ లేదు: క్లోజింగ్ ఆక్షన్ సెషన్ సంప్రదింపుల పత్రంపై సెబీకి 20,000 అభిప్రాయాలు.., ఎఫ్&ఓ సెటిల్‌మెంట్ నిబంధనల్లో మార్పులపై ప్రతిపాదనలు అమలాపురంలో శ్రీ తేజా ఒకేషనల్ జూనియర్ కాలేజీ ప్రారంభం, విద్యార్థులకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పనిచేయాలని యాజమాన్యానికి సూచన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జీబీఆర్ కళాశాల విద్యార్థులు. మలికిపురంలో జరిగే ప్రజా నాట్యమండలి జిల్లా మహాసభలు జయప్రదం చేయాలి.. అనుమతులు ఘనం.. బిల్లులు శూన్యం బీవీసీలో భట్లపాలెం నందు యువజన ఉత్సవాలు.. గోవింద నామస్మరణతో మార్మోగిన వాడపల్లి వెంకన్న ఆలయం మోడరన్ హైస్కూల్ లో ఆకట్టుకున్న రోబోటిక్స్ శిక్షణా కార్యక్రమం నగరంలో అంగన్వాడి ఉత్సవ్ వేడుకలు సైన్స్ ఎగ్జిబిట్స్‌పై విద్యార్థుల్లో ఆసక్తి పెంపు. నేటి రాశి ఫలాలు: 4 అక్టోబర్ 2026, ఆదివారం.. నేటి పంచాంగం: 4 అక్టోబర్ 2026, ఆదివారం

నగరంలో అంగన్వాడి ఉత్సవ్ వేడుకలు

Select Suryaa Now
నగరంలో అంగన్వాడి ఉత్సవ్ వేడుకలు

మామిడికుదురు :--- భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు పురస్కరించుకుని నగరం పితాని వారి మెరక గ్రామంలోను అంగన్వాడి సెంటర్లో శనివారం అంగన్వాడి ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరం గ్రామ మాజీ సర్పంచ్ జాలేం రమణ కుమారి  హాజరైయ్యారు. చిన్నారులు,గర్భిణులు,బాలింతలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నగరం సెక్టార్ లో ఉన్న  పలు అంగన్వాడి సెంటర్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని స్థల సేకరణ చేపట్టి అంగన్వాడి భవనాలు నిర్మించాలని బీజేపీ మండల శాఖ భైరిశెట్టి అధ్యక్షుడు రామకృష్ణ కోరారు... ఈ ఏడాది పదవ తరగతి ఫలితాల్లో మండల స్థాయిలో నగరం హై స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారనీ కాబట్టి తల్లి తండ్రులు అందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని నగరం టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షులు జాలేం సుబ్బారావు తెలిపారు.

 అంగన్వాడి కేంద్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేసే పౌష్టికాహారం కిట్లను గర్భిణులు,బాలింతలు , సద్వినియోగం చేసుకోవాలని బిడ్డ ఎదుగుదలకు దోహదపడతాయని సూపర్ వైజర్ రామలక్ష్మి కోరారు...అనంతరం నగరం సెక్టార్లో విధులు నిర్వహిస్తున్న పలువురు అంగన్వాడి సిబ్బంది నీ బిజెపి మండల శాఖ అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

 ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పూలు, పండ్లు,కాయగూరలు, ఆకు కూరలు, అంగన్వాడి పోషకాహారం కిట్లు ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది...ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కునపరెడ్డి సురేష్ కుమార్, నన్నేశా హుస్సేన్, వి.దుర్గారావు,రాయుడు ఆనంద్ రావు,అంగన్వాడి టీచర్లు హేమలత,సుజాత, అరుణ కుమారి,మంగదేవి.అరుణ, సత్య శ్యామల,గుబ్బల సత్య దుర్గ  తదితరులు పాల్గొన్నారు..