BREAKING
టిబెట్-నేపాల్ వరదలు: నేపాల్‌లో వేలమంది బలి బంగ్లాదేశ్‌లో దుర్గాపూజ ముంగిట ఉద్రిక్తత... ఇరాన్‌కు ఈ వారం సముద్రంలో చమురు లేదు, ఆదాయమూ లేదు: క్లోజింగ్ ఆక్షన్ సెషన్ సంప్రదింపుల పత్రంపై సెబీకి 20,000 అభిప్రాయాలు.., ఎఫ్&ఓ సెటిల్‌మెంట్ నిబంధనల్లో మార్పులపై ప్రతిపాదనలు అమలాపురంలో శ్రీ తేజా ఒకేషనల్ జూనియర్ కాలేజీ ప్రారంభం, విద్యార్థులకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పనిచేయాలని యాజమాన్యానికి సూచన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జీబీఆర్ కళాశాల విద్యార్థులు. మలికిపురంలో జరిగే ప్రజా నాట్యమండలి జిల్లా మహాసభలు జయప్రదం చేయాలి.. అనుమతులు ఘనం.. బిల్లులు శూన్యం బీవీసీలో భట్లపాలెం నందు యువజన ఉత్సవాలు.. గోవింద నామస్మరణతో మార్మోగిన వాడపల్లి వెంకన్న ఆలయం మోడరన్ హైస్కూల్ లో ఆకట్టుకున్న రోబోటిక్స్ శిక్షణా కార్యక్రమం నగరంలో అంగన్వాడి ఉత్సవ్ వేడుకలు సైన్స్ ఎగ్జిబిట్స్‌పై విద్యార్థుల్లో ఆసక్తి పెంపు. నేటి రాశి ఫలాలు: 4 అక్టోబర్ 2026, ఆదివారం.. నేటి పంచాంగం: 4 అక్టోబర్ 2026, ఆదివారం

గోవింద నామస్మరణతో మార్మోగిన వాడపల్లి వెంకన్న ఆలయం

Select Suryaa Now
గోవింద నామస్మరణతో మార్మోగిన  వాడపల్లి వెంకన్న ఆలయం

                                   వెంకన్న సన్నిధిలో సినీనటులు జీవన్ కుమార్

ఆత్రేయపురం మేజర్ న్యూస్ కోనసీమ తిరుమలగా కోరిన కోర్కెలు తీర్చే దైవంగా  విరాజిల్లుతున్న వాడపల్లి వెంకటేశ్వరస్వామివారి ఆలయం భక్తుల గోవింద నామ స్మరణతో మార్మోగింది. ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అనే నానుడితో రాష్ట్రాల నుండి వేలాదిమంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజనం మంత్రపుష్పం, పుణ్యా వచనం, కళ్యాణం వంటి కార్యక్రమాలను అర్చక బృందం వైభవంగా నిర్వహించారు.

కాలినడకన వచ్చే భక్తులకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. శనివారం స్వామివారి ఆదాయం రూ 60 లక్షలు సమకూరింది. ఆలయంలో నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి స్వామివారిని .సినీనటులు జీవన్ కుమార్ దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు వీరికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికే స్వామి విశిష్టత గురించి తెలియజేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చైర్మన్ ముదునూరి వెంకటరాజు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు లు ఏర్పాట్లను పర్యవేక్షించారు