సైన్స్ ఎగ్జిబిట్స్‌పై విద్యార్థుల్లో ఆసక్తి పెంపు.
అనపర్తి మేజర్ న్యూస్. శ్రీ ద్వారంపూడి బుల్లెమ్మాయి బాలికోన్నత పాఠశాల అనపర్తికి చెందిన 7, 9 తరగతుల విద్యార్థులు సైన్స్ ఎక్స్‌ప్లోర్ విజిట్‌లో భాగంగా రాజమహేంద్రవరం బొమ్మూరులోని విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సైన్స్ ఎగ్జిబిట్స్‌ను ఆసక్తిగా పరిశీలించి, వాటి పనితీరు, శాస్త్రీయ అంశాలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.అనంతరం రాజమహేంద్రవరంలోని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీని సందర్శించి బోటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ, హిస్టరీ ల్యాబ్‌లతో పాటు లైబ్రరీని పరిశీలించారు. ఆయా విభాగాలకు సంబంధించిన పలు అంశాలను అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ విజిట్‌లో పాల్గొని, ప్రత్యక్ష పరిశీలన ద్వారా శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే. కళ్యాణి, ఇన్‌చార్జ్ హెచ్‌ఎం ఎస్తేరు ప్రభ, ఉపాధ్యాయ సిబ్బంది, చైర్మన్ డి. వనములు, వైస్ చైర్మన్ ఏ. పార్వతి తదితరులు పాల్గొన్నారు.