BREAKING
అంగన్వాడీలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి గాంధీ జయంతి రోజున ముంబైలో సీజేపీ నిరసన: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో రోడ్లపైకి జనం, పోలీసుల అనుమతి నిరాకరణ మధ్య ఉద్రిక్తత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు చెప్పేవి అబద్ధాలు: రాజమహేంద్రవరంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సవాల్, 100 సీట్ల హామీపై నిలదీత చీనాబ్ - అంజీ బ్రిడ్జిలపై తొలిసారి గంటకు 100 కి.మీ. వేగంతో వందే భారత్ రోజూ కాఫీ తాగుతున్నారా... లివర్‌పై దాని ప్రభావం ఇదే! పండ్లు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది? ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తినడంపై నిపుణుల సలహాలు! విద్యార్థుల కల నెరవేరింది... బిసి హాస్టల్ మెస్ చార్జీల పెంచిన ప్రభుత్వం -కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు -తిరుపతిలో సీఎం డిప్యూటీ సీఎం, మంత్రుల చిత్రపటాలకు పలాభిషేకం సిగ్మా మూవీ రివ్యూ.. జేసన్ సంజయ్ దర్శకత్వ ప్రతిభ, సందీప్ కిషన్ నటన మెప్పించాయా? బాక్సాఫీస్ వద్ద తగ్గిన నాని ది ప్యారడైజ్ జోరు.. గాంధీ జయంతి సెలవు దినాన కూడా కలెక్షన్లలో పతనం! వాయిదా పడిన ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ ఉడ్తా తిర్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ! జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఘనస్వాగతం పలికిన తులసి రామకృష్ణ కొడుకు సినిమా పోస్టర్‌ను గర్వంగా ప్రదర్శించిన తమిళనాడు సీఎం విజయ్.. మధురాంతకం రోడ్‌షోలో అరుదైన దృశ్యం! ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం కార్గిల్ నిజమైన హీరోలను కలిసిన సిద్ధార్థ్, అభయ్ వర్మ.. గోల్డెన్ యారోస్ వేడుకల్లో భావోద్వేగ క్షణాలు!

పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం

Select Suryaa Now
పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం

మహిళల అభివృద్దే కుటుంబం అభివృద్ధి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్

పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్....
పార్టీలకు అతీతంగా  అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు.
మహిళలు ఆర్థికంగా బలపడితే  కుటుంబాలు ఆనందంగా ఉంటాయని అన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి పెనుబల్లి మండలంలో శుక్రవారం పర్యటించారు. లింగగూడెం,  ఉప్పలచెలక, లింగగూడెం గ్రామాలలో పర్యటించి 45 మంది లబ్ధిదారులకు 45,05,220 రూపాయల  కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రభుత్వంపై అబద్దాలు తప్పుడు ప్రచారం చేస్తుందని ఆమె ఆరోపించారు. ప్రతి కుటుంబం ఇంటిలో ప్రభుత్వ సంక్షేమ పథకం అందుతున్నాయని, ఫ్రీ బస్సు, ఉచిత కరెంట్, రైతు పథకాలు సన్నబియ్యం, బోనస్ వంటి అనేక పథకాలు అందుతున్నాయని లబ్ధిదారులు ప్రతిపక్ష పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. బిఆర్ఎస్ నాయకులు అధికారం ఉంటేనే కనిపిస్తారని అధికారం లేకపోతే ఫామ్ హౌస్లకే పరిమితం అవుతారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలలో మహిళల్ని కుటుంబ యజమానులను చేసిందని అన్నారు. రాబోవు పట్టభద్రుల ఎన్నికల్లో గ్రాడ్యుయేటర్ అందరూ ఓటును నమోదు చేసుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని దీవించాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమం లో తహసీల్దార్ వీరభద్రనాయక్, ఎంపీడీఓ వీరాస్వామి, మండల పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి పొట్లపల్లి వెంకటేశ్వరరావు, వీరబోయిన ప్రకాష్, బుక్క కృష్ణవేణి, భాగం నీరజ, సునీల, రాజబోయిన కోటేశ్వరరావు, పసుమర్తి విశ్వానాద్, గూడూరు మాధవరెడ్డి, బొర్రా కోటేశ్వరరావు, అలుగోజు చిన్న స్వామి, రాధకృష్ణ, మేకతొట్టి కాంతయ్య, పోతురాజు కిషోర్, దొంతు మాధవరావు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కర్రి కమలాకర్, కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.