ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పి పి ఎల్)జిల్లా అధ్యక్షుడిగా ఉప్పలయ్య*
*సూర్యాపేట టౌన్ మేజర్ న్యూస్*
సూర్యాపేట: ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పి పి ఎల్) జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం జూనియర్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఎన్నిక జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా బాలెంల ఉప్పలయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ప్రధాన కార్యదర్శిగా చింతకుంట్ల కనకధార, ఉపాధ్యక్షులుగా నాగజ్యోతి, గద్దల వీరబాబు, కోశాధికారిగా నాగయ్య, అధికార ప్రతినిధిగా పేరాల వెంకన్న, సహాయ కార్యదర్శులుగా శ్రీను, శైలజ, మీడియా ఇన్‌చార్జిగా మామిడి కృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాతంగి రాములు, మచ్చ నరసయ్య, ఎర్రమల్ల నాగమణి, దాసరి శ్రీను,రామాంజనేయులు, బోలికొండ వీరస్వామి తదితరులు నూతన కమిటీ సభ్యులను అభినందించారు. జిల్లా అధ్యక్షుడు బాలెంల ఉప్పలయ్య మాట్లాడుతూ తల్లిదండ్రుల సమస్యల పరిష్కారానికి, విద్యార్థుల హక్కుల పరిరక్షణకు సంఘం తరఫున నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.