BREAKING
గాంధీ జయంతి రోజున ముంబైలో సీజేపీ నిరసన: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో రోడ్లపైకి జనం, పోలీసుల అనుమతి నిరాకరణ మధ్య ఉద్రిక్తత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు చెప్పేవి అబద్ధాలు: రాజమహేంద్రవరంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సవాల్, 100 సీట్ల హామీపై నిలదీత చీనాబ్ - అంజీ బ్రిడ్జిలపై తొలిసారి గంటకు 100 కి.మీ. వేగంతో వందే భారత్ రోజూ కాఫీ తాగుతున్నారా... లివర్‌పై దాని ప్రభావం ఇదే! పండ్లు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది? ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తినడంపై నిపుణుల సలహాలు! విద్యార్థుల కల నెరవేరింది... బిసి హాస్టల్ మెస్ చార్జీల పెంచిన ప్రభుత్వం -కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు -తిరుపతిలో సీఎం డిప్యూటీ సీఎం, మంత్రుల చిత్రపటాలకు పలాభిషేకం సిగ్మా మూవీ రివ్యూ.. జేసన్ సంజయ్ దర్శకత్వ ప్రతిభ, సందీప్ కిషన్ నటన మెప్పించాయా? బాక్సాఫీస్ వద్ద తగ్గిన నాని ది ప్యారడైజ్ జోరు.. గాంధీ జయంతి సెలవు దినాన కూడా కలెక్షన్లలో పతనం! వాయిదా పడిన ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ ఉడ్తా తిర్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ! జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఘనస్వాగతం పలికిన తులసి రామకృష్ణ కొడుకు సినిమా పోస్టర్‌ను గర్వంగా ప్రదర్శించిన తమిళనాడు సీఎం విజయ్.. మధురాంతకం రోడ్‌షోలో అరుదైన దృశ్యం! ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం కార్గిల్ నిజమైన హీరోలను కలిసిన సిద్ధార్థ్, అభయ్ వర్మ.. గోల్డెన్ యారోస్ వేడుకల్లో భావోద్వేగ క్షణాలు! గాంధీ ఆదర్శాలను నిత్యజీవితంలో అలవర్చుకోవాలి : అధ్యక్ష కార్యదర్శులు దివాకర్ రెడ్డి, పనబాక లక్ష్మి

వేదిక్ లో డిప్యూటేషన్ దుమారం...! -ఎస్వీ వేదిక్ వర్సిటీలో శృతి మించిన రాజకీయ జోక్యం -గత రెండేళ్లగా స్థంభించిన పాలన...గ్రూపు రాజకీయాలు హల్చల్ -టీటీడీ అధికారులు జర దృషి సారించండి సారూ....అంటున్న పండితులు, ఉద్యోగులు -ఆ డిప్యూటేషన్ పై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్

Select Suryaa Now
వేదిక్ లో డిప్యూటేషన్ దుమారం...! -ఎస్వీ వేదిక్ వర్సిటీలో శృతి మించిన రాజకీయ జోక్యం -గత రెండేళ్లగా స్థంభించిన పాలన...గ్రూపు రాజకీయాలు హల్చల్ -టీటీడీ అధికారులు జర దృషి సారించండి సారూ....అంటున్న పండితులు, ఉద్యోగులు -ఆ డిప్యూటేషన్ పై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్

టీటీడీ ఆధ్వర్యంలో నడస్తున్న ఎస్వీ వేదక్ వర్సిటీ పాలన స్థంబించింది. వేద విద్య, పరిశోధనలకు పెద్ద పీట వేయాల్సిన అధికారులు వర్సిటీలో రాజకీయాలను పెంచిపోషిస్తున్నారు. దీంతో ఉద్యోగులు సైతం గ్రూపు రాజకీయాలకు తెరలేపి హల్చల్ చేస్తున్నారు. రాజకీయ అండదండలతో చెలరేగిపోతూ వర్సిటీకి మచ్చ తెస్తున్నారనే వార్తలు వర్సిటీ హల్చల్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల ఓ అధికారిణి డిప్యూటేషన్ వ్యవహరం వర్సిటీలో దుమారం లేపుతోంది.

-దుమారం రేపుతున్న డిప్యూటేషన్ వ్యవహారం

వేదిక్ వర్సిటీలో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గా డిప్యుటేషన్ గా పనిచేస్తున్న అధికారిణి శ్రావణ వ్యహారం వర్సిటీలో దుమారం రేపుతోంది. ఆమె డిప్యుటేషన్ కాలవ్యవధి ఈనెల 7వ తేదీతో ముగియనుండటంతో పదవీకాలం పొడిగింపు కోసం తీవ్ర స్థాయిలో రాజకీయ ఒత్తిడి తెస్తున్నట్లు వర్సిటీలో పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది. వర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా ఎగ్జిక్యూటీ కౌన్సిల్కు సమాచారం లేకుండా రిజిస్ట్రార్ స్థాయి అధికారికి తెలియకుండా వ్యవస్థను పక్కన పెట్టి రాజకీయ నాయకుల నుంచి టీటీడీ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తోందని అధికారులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఆమె సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న సమయంలోనూ ఆమెపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. మరో 5రోజులలో ఆయన కాలవ్యవధి ముగియనన్న ప్రస్తుత వీసీ ఆమె డిప్యూటేషన్కు నిబంధలకు విరుద్ధంగా మద్దతు పలకడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం వర్సిటీలో వస్తున్న ఆరోపణలపైన, విధుల నిర్వహణపై, డిప్యుటేషన్ కు సంబంధించిన రికార్డులు, ప్రస్తుత వీసీ నేరుగా డిప్యూటేషన్ వ్వవహారంలో ఆమె మాతృశాఖకు పంపిన లేఖపైన సమగ్ర విచారణ జరపాలని వర్సిటీతో పాటు పలవురు అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ జోక్యంతో వర్సిటీ నిబంధనలను పక్కన పెట్టి ఆమెను తిరిగి కొనసాగిస్తే వర్సిటీ రాజకీయాలకు వేధికగా మారడం తథ్యమని వారు ఆరోపిస్తున్నారు. 

-పాలన గాడిన పడేనా…

గత రెండేళ్లుగా టీటీడీ అధికారుల వర్సిటీ వైపు కన్నెత్తి చూడకపోవడం దారుణమని, కనీసం ఎంతో ప్రతిష్టాత్మకమైన వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవాలకు కానీ, వర్సిటీలో జరిగిన కీలకమైన సదస్సులకు టీటీడీ అధికారులు హాజరుకాకపోవడం, పాలన గాడి తప్పిందనడానికి ప్రధాన నిదర్శనమని విద్యార్థులు, అధ్యాపకులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు గ్రూపు రాజకీయాలను నడపడం వర్సిటీలో నిత్యకృత్యమైందని, ప్రతి చిన్న విషయానికి రాజకీయ ఒత్తిడి పెరుగుతోందని చెబుతున్నారు. నాణ్యమైన వేద విద్యను విద్యార్థులకు అందించడం, పరిశోధనలు కొత్త పుంతలు తొక్కించడంపై టీటీడీ, వర్సిటీ అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. ప్రస్తుత వీసీ పదవీకాలం ఈనెల 9వ తేదీతో ముగియనుండటంతో అదే రోజున నూతన వీసీగా నియమితులైన సంస్కృత వర్సిటీ ప్రొఫెసర్ గణపతిభట్ బాధ్యతలు తీసుకోనున్నారు.

సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి