గాంధీ ఆదర్శాలను నిత్యజీవితంలో అలవర్చుకోవాలి : అధ్యక్ష కార్యదర్శులు దివాకర్ రెడ్డి, పనబాక లక్ష్మి
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు తిరుపతిలోని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు, టిటిడి పాలకమండలి సభ్యులు పనబాక లక్ష్మి, తుడా చైర్మన్, టీటీడీ ఎక్స్ అఫిషియో మెంబర్, తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరై రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తిరుపతి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జేబీ శ్రీనివాస్ తో కలసి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ "దేశ స్వాతంత్ర్యం కోసం అహింస, సత్యాగ్రహాన్ని ఆయుధాలుగా చేసుకొని బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన మహనీయుడు గాంధీజీ. ఆయన చూపిన శాంతి, సత్యం, అహింసా మార్గాలు నేటికీ ఆచరణీయం. ప్రతి ఒక్కరూ గాంధీ ఆదర్శాలను నిత్య జీవితంలో అలవర్చుకోవాలి" అని పిలుపునిచ్చారు.గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, స్వచ్ఛతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, పార్లమెంట్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని గాంధీజీ సేవలను స్మరించుకున్నారు.
సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి