BREAKING
బంగ్లాదేశ్‌లో దుర్గాపూజ ముంగిట ఉద్రిక్తత... ఇరాన్‌కు ఈ వారం సముద్రంలో చమురు లేదు, ఆదాయమూ లేదు: క్లోజింగ్ ఆక్షన్ సెషన్ సంప్రదింపుల పత్రంపై సెబీకి 20,000 అభిప్రాయాలు.., ఎఫ్&ఓ సెటిల్‌మెంట్ నిబంధనల్లో మార్పులపై ప్రతిపాదనలు అమలాపురంలో శ్రీ తేజా ఒకేషనల్ జూనియర్ కాలేజీ ప్రారంభం, విద్యార్థులకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పనిచేయాలని యాజమాన్యానికి సూచన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జీబీఆర్ కళాశాల విద్యార్థులు. మలికిపురంలో జరిగే ప్రజా నాట్యమండలి జిల్లా మహాసభలు జయప్రదం చేయాలి.. అనుమతులు ఘనం.. బిల్లులు శూన్యం బీవీసీలో భట్లపాలెం నందు యువజన ఉత్సవాలు.. గోవింద నామస్మరణతో మార్మోగిన వాడపల్లి వెంకన్న ఆలయం మోడరన్ హైస్కూల్ లో ఆకట్టుకున్న రోబోటిక్స్ శిక్షణా కార్యక్రమం నగరంలో అంగన్వాడి ఉత్సవ్ వేడుకలు సైన్స్ ఎగ్జిబిట్స్‌పై విద్యార్థుల్లో ఆసక్తి పెంపు. నేటి రాశి ఫలాలు: 4 అక్టోబర్ 2026, ఆదివారం.. నేటి పంచాంగం: 4 అక్టోబర్ 2026, ఆదివారం మృతుల కుటుంబాలకు బిఆర్ఎస్ ఆర్థిక సహాయం

నెక్కొండలో ఉపేందర్ హాస్పిటల్ పై అధికారుల దాడి

Select Suryaa Now
నెక్కొండలో ఉపేందర్ హాస్పిటల్ పై అధికారుల దాడి


స్కానర్‌ స్వాధీనం  ముగ్గురిపై కేసు నమోదు
రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు.. ఇతరుల ప్రమేయంపైనా విచారణ
నెక్కొండ, అక్టోబర్‌ 3 మేజర్ న్యూస్ (సూర్య) : నెక్కొండ పట్టణంలోని ఉపేందర్‌ హాస్పిటల్‌లో అనుమతులు లేకుండా గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారన్న నమ్మదగిన సమాచారంతో వైద్య, రెవెన్యూ, పోలీసు అధికారులు శనివారం ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో గర్భస్థ లింగ నిర్ధారణకు ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించిన స్కానర్‌తో పాటు మూడు సెల్‌ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి చెందిన ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సాజిదా అతహరి ఆధ్వర్యంలో నెక్కొండ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ హంస నరేందర్‌, జి పి ఓ గాదె అశోక్‌ తదితరులు, పోలీసు అధికారుల సహకారంతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
తనిఖీల సమయంలో ఉపేందర్‌ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్‌ బాల్నే పార్థు, ఫిజియోథెరపిస్ట్‌ మంకాల గణేష్‌, నర్సు సముద్రాల పద్మ అక్కడ ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారి ఆధీనంలో గర్భస్థ శిశువు లింగ నిర్ధారణకు ఉపయోగిస్తున్నట్లు అనుమానిస్తున్న స్కానర్‌ ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.
రూ.5 వేల వరకు వసూలు చేశారన్న ఆరోపణ
అధికారుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం ఎలాంటి అనుమతులు లేకుండా స్కానర్‌ను ఉపయోగిస్తూ గర్భిణీలకు ముందస్తు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తేలింది. ఒక్కో పరీక్షకు రూ.5,000 వరకు గర్భిణీలు, వారి కుటుంబ సభ్యుల నుంచి వసూలు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు.
స్కానర్‌ను హైదరాబాద్‌కు చెందిన నరేందర్‌ వద్ద నుంచి తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైనట్లు, ఈ వ్యవహారంలో మంకాల గణేష్‌ సహకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. గర్భిణీలకు నిర్వహించిన పరీక్షల్లో ఆడ శిశువు ఉన్నట్లు తేలితే అబార్షన్‌ చేయించేందుకు మహబూబాబాద్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తుల వద్దకు పంపుతున్నారన్న ఆరోపణలపైనా దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.
గతంలోనూ కేసులు ఉన్నాయన్న అధికారుల సమాచారం
డాక్టర్‌ బాల్నే పార్థుపై గతంలో నెక్కొండ, మహబూబాబాద్‌, కమలాపూర్‌ ప్రాంతాల్లో కేసులు నమోదైనట్లు అధికారుల ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఇటీవల అయినవోలు ప్రాంతంలో జరిగిన గర్భిణీ, ఆమె పిల్లల మృతి ఘటనకు సంబంధించి కూడా ఆయనపై ఆరోపణలు వచ్చాయని, ఆ కేసులో ఆయనను అరెస్టు చేసి ఆసుపత్రిని సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వివరాలను సంబంధిత దర్యాప్తు రికార్డుల ఆధారంగా మరింతగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
ముగ్గురిపై కేసు.. మరింత లోతుగా దర్యాప్తు
డాక్టర్‌ సాజిదా అతహరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డాక్టర్‌ బాల్నే పార్థు, మంకాల గణేష్‌, సముద్రాల పద్మలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్కానర్‌ యంత్రం, మూడు సెల్‌ఫోన్లు, మంకాల గణేష్‌కు చెందిన ద్విచక్ర వాహనాన్ని సీజ్‌ చేసినట్లు వెల్లడించారు.
ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని, విచారణలో మరెవరైనా అక్రమ గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలకు సహకరించినట్లు తేలితే వారిపైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.