కోటపల్లి మార్కెట్ చైర్‌పర్సన్‌గా రమావత్ అనితాబాయి రమేష్
వైస్‌చైర్మన్‌గా మంగళారం మధులత శ్రీనివాస్
నూతన పాలకవర్గాన్ని ప్రకటించిన ప్రభుత్వం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్( అక్టోబర్ 3):కోటపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. చైర్‌పర్సన్‌గా రమావత్ అనితాబాయి రమేష్, వైస్‌చైర్మన్‌గా మంగళారం మధులత శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు పలువురిని మార్కెట్ కమిటీ సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.నూతన మార్కెట్ కమిటీ సభ్యులుగా రంజోల్ బాలకృష్ణ రెడ్డి, రాథోడ్ రవి, దసరి యానగుండే పెద్ద నర్సిములు, షేక్ గోరెమియా, గజ్జల అనంతయ్య, గంగసారం హర్షవర్ధన్ రెడ్డి, శంకర్ నాయక్, బూసనెల్లి ప్రభాకర్ రెడ్డి, తేనె రవీందర్ రెడ్డి, జనగామ నర్సింహులు, చీకటమల్ర కిరణ్ కుమార్, నరసాపురం శ్రీధర్లను నియమించారు.
అధికారులకు కూడా ప్రాతినిధ్యం
మార్కెట్ కమిటీ పాలకవర్గంలో ప్రజాప్రతినిధులు, రైతు ప్రతినిధులతో పాటు సంబంధిత శాఖల అధికారులకు కూడా ప్రాతినిధ్యం కల్పించారు. జిల్లా మార్కెటింగ్ అధికారి, తాండూరు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు, తట్టేపల్లి పీఏసీఎస్ చైర్మన్, వికారాబాద్ గ్రామపంచాయతీ చైర్‌పర్సన్ తదితరులు కమిటీలో అధికారిక సభ్యులుగా కొనసాగనున్నారు.
నూతన పాలకవర్గానికి అభినందనలు
కోటపల్లి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం నియామకంపై స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతు వర్గాలు హర్షం వ్యక్తం చేశారు. చైర్‌పర్సన్ రమావత్ అనితాబాయి, వైస్‌చైర్మన్ మంగళారం మధులతతో పాటు నూతన సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ కోటపల్లి మార్కెట్ కమిటీని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
కుమ్మరి రాఘవేందర్, వికారాబాద్ జిల్లా ప్రతినిధి.