రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
రాయలసీమలో హార్టికల్చర్ రంగానికి రూ. లక్ష కోట్లు కేటాయిస్తున్నామంటూ చంద్రబాబు ప్రభుత్వం కేవలం అంకెల గారడీతో డ్రామాలు ఆడుతోందని, అసలు బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేకుండా రైతులను మభ్యపెడుతోందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. అంతేకాకుండా, హార్టికల్చర్ సహా ఇతర పంటలకు సరైన మద్దతు ధర లభించక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని తన ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు.