BREAKING
నేటి రాశి ఫలాలు: 4 అక్టోబర్ 2026, ఆదివారం.. నేటి పంచాంగం: 4 అక్టోబర్ 2026, ఆదివారం మృతుల కుటుంబాలకు బిఆర్ఎస్ ఆర్థిక సహాయం కళ్యాణదుర్గం టి - సర్కిల్ అభివృద్ధి పనులకు శ్రీ కారం. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి నెక్కొండలో ఉపేందర్ హాస్పిటల్ పై అధికారుల దాడి అర్హులైన పట్టభద్రులు ఫారం- 18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి హనుమకొండ ఆర్టీసీ డిపోలో ఎన్నికల ప్రచారం కళ్యాణదుర్గం కొల్లాపూరమ్మ ఆలయం లో చోరీ. మున్సిపాలిటీ పై వై సి పి జెండా ఎగరేయడమే లక్ష్యం. మాజీ ఎంపీ తలారి రంగయ్య. గోపాలపురంలో గురుకుల విద్యార్థులకు మహిళా భద్రతపై అవగాహన, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ సూచన చెన్నైలో తుదిశ్వాస విడిచిన విలక్షణ సినీ సృష్టికర్త ముంగండ - ఇసుకపూడి రహదారి పనులు వేగవంతం హైస్కూల్ గ్రౌండ్‌లో రొయ్యల లోడింగ్: దుర్వాసనతో విద్యార్థుల అవస్థలు స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర అవార్డు అందుకున్న మాచవరం పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణకు ఘన సన్మానం

హైస్కూల్ గ్రౌండ్‌లో రొయ్యల లోడింగ్: దుర్వాసనతో విద్యార్థుల అవస్థలు

Select Suryaa Now
హైస్కూల్ గ్రౌండ్‌లో రొయ్యల లోడింగ్: దుర్వాసనతో విద్యార్థుల అవస్థలు

అంబాజీపేట:మేజర్ న్యూస్ :అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామంలో బాధ్యతారాహిత్య చర్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) ఆవరణ సమీపంలో ఉన్న పచ్చి రొయ్యల  చెరువుల నుండి రొయ్యలు పట్టిన వ్యాపారులు, లోడింగ్ ప్రక్రియను నేరుగా పాఠశాల ఆటల మైదానంలోనే చేపట్టడం వివాదాస్పదంగా మారింది.
రొయ్యలను ఐస్ వేసి బాక్సుల్లో నింపే క్రమంలో వెలువడిన మురుగునీరు (వేస్ట్ వాటర్) అంతా పాఠశాల గ్రౌండ్‌లోనే ఉండిపోయింది. నీరు నిల్వ ఉండిపోవడం వల్ల పాఠశాల ప్రాంగణమంతా తీవ్రమైన కంపు కొడుతోంది. నిత్యం వందలాది మంది విద్యార్థులు చదువుకునే, ఆటలాడుకునే గ్రౌండ్‌లో ఈ రసాయనాలు కూడిన నీరు నిలిచిపోవడంతో ఈగలు, దోమలు ముసిరి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని  గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
పాఠశాల ఆవరణను వ్యాపార అవసరాలకు వాడుకుంటూ అపరిశుభ్రం చేసిన వారిపై స్థానిక పంచాయతీ, విద్యాశాఖ అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఇసుకపూడి గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.