BREAKING
బంగ్లాదేశ్‌లో దుర్గాపూజ ముంగిట ఉద్రిక్తత... ఇరాన్‌కు ఈ వారం సముద్రంలో చమురు లేదు, ఆదాయమూ లేదు: క్లోజింగ్ ఆక్షన్ సెషన్ సంప్రదింపుల పత్రంపై సెబీకి 20,000 అభిప్రాయాలు.., ఎఫ్&ఓ సెటిల్‌మెంట్ నిబంధనల్లో మార్పులపై ప్రతిపాదనలు అమలాపురంలో శ్రీ తేజా ఒకేషనల్ జూనియర్ కాలేజీ ప్రారంభం, విద్యార్థులకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పనిచేయాలని యాజమాన్యానికి సూచన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జీబీఆర్ కళాశాల విద్యార్థులు. మలికిపురంలో జరిగే ప్రజా నాట్యమండలి జిల్లా మహాసభలు జయప్రదం చేయాలి.. అనుమతులు ఘనం.. బిల్లులు శూన్యం బీవీసీలో భట్లపాలెం నందు యువజన ఉత్సవాలు.. గోవింద నామస్మరణతో మార్మోగిన వాడపల్లి వెంకన్న ఆలయం మోడరన్ హైస్కూల్ లో ఆకట్టుకున్న రోబోటిక్స్ శిక్షణా కార్యక్రమం నగరంలో అంగన్వాడి ఉత్సవ్ వేడుకలు సైన్స్ ఎగ్జిబిట్స్‌పై విద్యార్థుల్లో ఆసక్తి పెంపు. నేటి రాశి ఫలాలు: 4 అక్టోబర్ 2026, ఆదివారం.. నేటి పంచాంగం: 4 అక్టోబర్ 2026, ఆదివారం మృతుల కుటుంబాలకు బిఆర్ఎస్ ఆర్థిక సహాయం

హనుమకొండ ఆర్టీసీ డిపోలో ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
హనుమకొండ ఆర్టీసీ డిపోలో ఎన్నికల ప్రచారం

 

పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రాం రెడ్డి,  ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

హనుమకొండ టౌన్, అక్టోబర్ 3, మేజర్ న్యూస్ సూర్య,

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ  గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఇందులో భాగంగా శనివారం హనుమకొండ ఆర్టీసీ డిపో పరిధిలో నిర్వహించిన భారీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ  అధ్యక్షులు ఇనగాల వెంకట్రాం రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సంయుక్తంగా పాల్గొని కార్మికులను కలిశారు. ఈ సందర్భంగా వారు ఆర్టీసీ కార్మికులు, సిబ్బందిని వ్యక్తిగతంగా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కార్మికులకు జరుగుతున్న మేలును, సంస్థ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సుకు, సంస్థ సంక్షేమానికి ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించే కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘాన్ని ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. హనుమకొండ, వరంగల్ పరిధిలోని అన్ని డిపోల్లోనూ కాంగ్రెస్ అనుబంధ సంఘం ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నూతనంగా నియమితులైన డివిజన్ల అధ్యక్షులతో కలిసి క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు పేర్కొన్నారు.