కట్టరాంపూర్ లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
సూర్య కరీంనగర్ : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్
కట్టరాంపూర్ రామచంద్రాపూర్ కాలనీలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. రోడ్ నంబర్ 21/7లో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం మేయర్ కొలగాని శ్రీనివాస్, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేశారు. ఘన స్వాగతం పలికిన 11వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శ్రీ ఆకుల నర్మదా నర్సన్న గారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో రహదారి సౌకర్యం మెరుగుపడటంతో స్థానిక ప్రజలకు రాకపోకలు సులభతరం కానున్నాయ న్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. సీసీ రోడ్డు నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అనంతరం డివిజన్లోని న్యూ శ్రీనగర్ కాలనీ పార్కులో కూడా ఓపెన్ జిమ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.ఈ కార్యక్రమాలలో ధర్మారం సింగిల్ విండో చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, కాలనీవాసులు అలీముద్దీన్ , జాజిరెడ్డి, మోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, నవీన్ కుమార్,గుడిపాటి రమణారెడ్డి, భూపతి జగన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, కుంభం కృష్ణ, రాజేందర్ శర్మ, మరియు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు