పే స్కేల్ అమలు, నామినీ విఆర్ఎ ల రెగ్యులరైజ్, ప్రమోషన్ల కల్పన కోసం విఆర్ఎ ల ఆర్తనాదం
- పి.గన్నవరం మేజర్ న్యూస్:గ్రామ రెవెన్యూ సహాయకుల (విఅర్ఎ) సహాయ నిరాకరణ ఉద్యమ పోరాట సమ్మె శనివారం 18వ రోజుకు చేరుకుంది.పి.గన్నవరం మండల కేంద్రంలో గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో వినూత్న రీతిలో శనివారం నిరసన తెలిపారు. చెవిలో పువ్వు, కళ్ళకు గంతలు కట్టుకుని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మా విఆర్ఎ లకు పే స్కేల్ చేయండి, నామినీ విఆర్ఎ లను రెగ్యులర్ చేయండి, అర్హులైన వారికి ప్రమోషన్లు కల్పించండి" అంటూ తమ ఆర్తనాదాలను వినిపించారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఆకుమర్తి శ్రీకృష్ణ శ్రీనివాసరావు, సెక్రటరీ యార్లగడ్డ మహాలక్ష్మి, ఉపాధ్యక్షులు పల్లేరు చిట్టి వెంకన్న, నేదునూరి నాగూర్ మీరా సాహెబ్, పసుపులేటి శ్రీనివాసరావు, పల్లపు నుకాలమ్మ తదితరులు పాల్గొన్నారు.