మున్సిపాలిటీ పై వై సి పి జెండా ఎగరేయడమే లక్ష్యం. మాజీ ఎంపీ తలారి రంగయ్య.
కళ్యాణదుర్గం టౌన్ ప్రతినిధి :-
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కళ్యాణదుర్గం మున్సిపాలిటీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని మాజీ ఎంపీ తలారి రంగయ్య పిలుపునిచ్చారు. పట్టణంలోని కోటవీధిలో నిర్వహించిన వైసీపీ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని పార్టీ కుటుంబ సభ్యులకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తలారి రంగయ్య మాట్లాడుతూ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. పార్టీకి కార్యకర్తలే కొండంత బలమని, ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. స్థానిక సమస్యలను తెలుసుకుని ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయానికి ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. వార్డుల వారీగా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగితే పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. కోటవీధిలో తలారి రంగయ్య పర్యటనతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.