మృతుల కుటుంబాలకు బిఆర్ఎస్ ఆర్థిక సహాయం
మంగపేట, అక్టోబర్ 03, సూర్య (మేజర్ న్యూస్): ములుగు జిల్లా మంగపేట మండలంలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. అక్కినేపల్లి మల్లారం గ్రామంలో జక్క రాజేందర్ కుటుంబానికి, దొడ్డా చిన నర్సయ్య కుటుంబానికి రూ. 5,000 చొప్పున, కొత్తమల్లూరు గ్రామంలో బట్ట నిర్మల కుటుంబానికి రూ. 5,000, తిమ్మంపేట గ్రామంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మోదుగు బాబు భార్య మోదుగు శ్రీలత కుటుంబానికి రూ. 5,000 ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా కమలాపురం గ్రామంలో మండల నాయకులు కోడం సత్యనారాయణ అన్న కోడం సమ్మయ్య దశ దినకర్మలలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు తాటి కృష్ణ, కుర్బన్ అలీ, పప్పు వెంకటరెడ్డి, చిట్టి మల్ల సమ్మయ్య, కాడబోయిన నరేందర్, సిద్ధం శెట్టి లక్ష్మణు రావు, మండల నాయకులు యాలవర్తి శ్రీనివాస్, నాగేశ్వరావు, ఫిరోజ్, రూప భద్రయ్య, మునిగేల సాంబుల్, నర్సింహులు, దంతనపల్లి నరేందర్, సాంబశివరావు, సోషల్ మీడియా వారియర్ మునిగేలా నరేష్ తదితరులు పాల్గొన్నారు.