రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్‌గా డాక్టర్ ఎస్.ఎం. రాజేశ్వర్‌రావు
వైస్ చైర్మన్‌గా పసుపులేటి శ్రీనివాస్ నాయుడు.. ట్రెజరర్‌గా డాక్టర్ కె. సంపత్‌కుమార్
రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా మియ్యాపురం రమేష్
ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 4): ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా బ్రాంచ్ నూతన చైర్మన్‌గా డాక్టర్ ఎస్.ఎం. రాజేశ్వర్‌రావు ఎన్నికయ్యారు. ఆదివారం బోయిన్‌పల్లి జాతీయ రహదారి–44 సమీపంలోని ఎంఎంఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్‌లో జిల్లా సహకార అధికారి, ఎన్నికల అధికారి జి. శ్రీనివాస్ పర్యవేక్షణలో పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనతోపాటు పదాధికారుల ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది.
నూతన పదాధికారులు:
15 మంది మేనేజింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక అనంతరం ప్రత్యేకంగా సమావేశమైన కమిటీ సభ్యులు జిల్లా బ్రాంచ్ నూతన పదాధికారులను ఎన్నుకున్నారు.
చైర్మన్: డాక్టర్ ఎస్.ఎం. రాజేశ్వర్‌రావు
వైస్ చైర్మన్: పసుపులేటి శ్రీనివాస్ నాయుడు
ట్రెజరర్ (కోశాధికారి): డాక్టర్ కె. సంపత్‌కుమార్
స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యుడు: మియ్యాపురం రమేష్
1,263 ఓట్లు చెల్లుబాటు:జిల్లా బ్రాంచ్‌లోని 15 డైరెక్టర్ స్థానాలకు 30 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఓటర్ల సౌకర్యార్థం 9 పోలింగ్ బూత్‌లు, 3 ఓటింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. మొత్తం 4,298 మంది ఓటర్లు ఉండగా 1,309 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం జరిగిన ఓట్ల లెక్కింపులో 1,263 ఓట్లు చెల్లుబాటు కాగా, 46 ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బోయిన్‌పల్లి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు, ఓటర్ల సందడితో పోలింగ్ కేంద్రం వద్ద ఉత్సాహభరిత వాతావరణం నెలకొన్నప్పటికీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.
మేనేజింగ్ కమిటీకి ఎన్నికైన 15 మంది:
వి. చంద్రశేఖర్‌రెడ్డి, లోక రామాదేవి, అద్దుల్ల మల్లేశ్ యాదవ్, బి. లింగారెడ్డి, డాక్టర్ ఎస్.ఎం. రాజేశ్వర్‌రావు, ఎ. బాలరాములు, ద్యాకం రాజు, మియ్యాపురం రమేష్, పసుపులేటి శ్రీనివాస్ నాయుడు, ఎ. శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ కె. సంపత్‌కుమార్, సి.ఎస్. రామకృష్ణ, శ్రేయస్ సూరినేని, మహమ్మద్ అబ్దుల్ రజాక్, రమేష్‌కుమార్ ఔజుమీడి మేనేజింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.జిల్లా రెడ్‌క్రాస్ శాఖ నూతన పదాధికారుల ఎన్నికతో ఎన్నికల ప్రక్రియ పూర్తికాగా, కొత్త కమిటీ బాధ్యతలు చేపట్టింది.
పన్నాల బాల్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రతినిధి.