బిజెపి మండల నూతన కార్యవర్గ సభ్యుల ఎంపిక ఎకగ్రీవం
.త్రిపురాంతకం, మేజర్ న్యూస్.
త్రిపురాంతకం మండలం భారతీయ జనతా పార్టీ మండల పార్టీ కార్యవర్గ సభ్యుల ఎన్నికసమావేశం జరిగింది. ఎన్నిక త్రిపురాంతకం మండల బిజెపి మండల పార్టీ కన్వీనర్ సముద్రాల ముని మల్లికార్జునరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి మార్కాపురం జిల్లా బిజెపి జిల్లా పార్టీ అధ్యక్షులు పీవీ కృష్ణారావు జిల్లా ప్రధాన కార్యదర్శి మండ్ల శివప్రసాదు, ముఖ్య అతిథులుగా హాజరై మండల పార్టీ కార్యాలయంలో ఎన్నికలను ఏకగ్రీవంగా నిర్వహించారు.. మండల బిజెపి పార్టీ కన్వీనర్ సముద్రాల ముని మల్లికార్జున రావు ఆధ్వర్యంలో వివిధ మండల మోర్చా అధ్యక్ష కార్యదర్శులు ఎన్నికలను ఏకగ్రీవంగా ఎన్నిక నిర్వహించారు. మండల యువ మోర్చా గా సముద్రాల సాయి గుత్తా వెంకటేశ్వర్లు ఓబీసీ మోర్చా బత్తుల ఆదినారాయణ గోపి దేశి వీరనారాయణ మహిళా మోర్చా కాసు లక్ష్మి , కజ్జాయం ప్రమీల మైనార్టీ మోర్చా దూదేకుల నాసరయ్య దూదేకుల ఇమామ్ ఎస్సీ మోర్చా పి తిమోతి పులివెందుల చంద్రమోహన్ ఎస్టి మోర్చా శ్రీను నాయక్ రంగ సాయి లను నూతనంగా నియమించడం జరిగింది ఈ కార్యక్రమంలో కోండ్రు పిచ్చయ్య ఎన్ వీరాంజనేయులు జిల్లా కార్యదర్శి సంవత్సరాల మల్లికార్జునరావు వివిధ మూర్ఛ అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.