BREAKING
నేచురల్ స్టార్ నాని బ్లడీ రోమియో సినిమా హీరోయిన్ ఫిక్స్, సుజీత్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ బిజెపి మండల నూతన కార్యవర్గ సభ్యుల ఎంపిక ఎకగ్రీవం తపాలా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక ఉత్తర కొరియాతో జెట్ డ్రోన్ టెక్నాలజీని పంచుకున్న రష్యా వన్యప్రాణుల పరిరక్షణకు పరుగులు రియాద్ వేదికగా రేపు మక్కా ఒప్పంద కమిటీ సమావేశం భోజనం చేసిన తర్వాత ఛాతీలో మంట ఎందుకు వస్తుంది, కారణాలు మరియు నివారణ మార్గాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన పండు దానిమ్మ, శాస్త్రవేత్తల సరికొత్త పరిశోధన పట్టభద్రుల తీర్పు.. యువత భవిష్యత్తుకు మలుపు:డా. చినుకని శివ ప్రసాద్ జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినవచ్చా, వైద్యులు ఏం చెబుతున్నారు మరియు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలిసిన నసనకోట ఎం జె పి విద్యా కమిటీ చైర్మన్ సౌజన్య నాగండ్ల నేత్రదానం తొలి సినిమాపై శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు, నాన్న కోసమే ఆ నటన అంటున్న నటి ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలసి సన్మానించిన నసనకోట ఎం జె పి విద్యా కమిటీ చైర్మన్ సౌజన్య ఎస్‌ఎస్‌ రాజమౌళి వారణాసి సినిమా షూటింగ్ అప్‌‌డేట్, రికార్డు వేగంతో జక్కన్న ప్రాజెక్ట్

రాంపల్లి మరో జవహర్‌నగర్‌గా మారొద్దు.. !

Select Suryaa Now
రాంపల్లి మరో జవహర్‌నగర్‌గా మారొద్దు.. !

చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి
ప్రజారోగ్యంతో చెలగాటం సరికాదు: మాజీ చైర్మన్‌ చంద్రారెడ్డి
డంపింగ్‌ ప్రాంతాల ప్రజల త్యాగాన్ని గుర్తించాలి: మాజీ కౌన్సిలర్‌ శ్రీనివాస్‌గౌడ్‌

మేడ్చల్ జిల్లా ప్రతినిధి/కీసర మేజర్ న్యూస్ (అక్టోబర్‌ 4):
రాంపల్లి మరో జవహర్‌నగర్‌గా మారే పరిస్థితి రాకుండా ప్రభుత్వం, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తక్షణమే స్పందించి చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్‌ చంద్రారెడ్డి, మాజీ కౌన్సిలర్‌ శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం రాంపల్లిలో పేరుకుపోయిన చెత్త కుప్పలను పరిశీలించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

మూడు నెలలుగా చెత్త తరలింపు బంద్‌

రాంపల్లిలో మూడు నెలలుగా రామ్‌కీ సంస్థ చెత్తను తరలించడం నిలిచిపోయిందని వారు ఆరోపించారు. దీంతో చెత్త సేకరణ వాహనాలు స్థానిక ప్రాంతాల్లోనే వ్యర్థాలను పడేస్తుండటంతో పెద్దఎత్తున చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయని తెలిపారు. దుర్వాసన, ఈగలు, దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే చెత్తను తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరారు.

ఇక డంపింగ్‌ భారం వద్దు

నాగారం, రాంపల్లి, దమ్మాయిగూడ, అహ్మద్‌గూడ, చీర్యాల, కీసర ప్రాంతాల ప్రజలు ఇప్పటికే డంపింగ్‌ సమస్యలను భరిస్తున్నారని శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. నగరవాసుల కోసం తమ ప్రాంతాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించాలని, ఇకపై కొత్తగా డంపింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయరాదని డిమాండ్‌ చేశారు.

వాహనాలు.. సిబ్బందిని పెంచాలి

మున్సిపల్‌ కార్పొరేషన్‌లో విలీనమైన తర్వాత చెత్త సేకరణకు సరిపడా వాహనాలు, సిబ్బందిని కేటాయించలేదని వారు విమర్శించారు. తడి, పొడి చెత్తను ఇంటింటి నుంచి వేర్వేరుగా సేకరించే విధానాన్ని పటిష్టం చేయాలని కోరారు. చెత్తను శాస్త్రీయ పద్ధతిలో తరలించి, ప్రాసెసింగ్‌ చేసే శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.

స్పందించకపోతే ఆందోళన

అక్రమ డంపింగ్‌పై నిఘా ఏర్పాటు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు సంస్థల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని కోరారు. అధికారులు వెంటనే స్పందించకపోతే ప్రజలతో కలిసి పెద్దఎత్తున ధర్నాలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రజారోగ్యాన్ని కాపాడేలా రాంపల్లి చెత్త సమస్యకు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

రిపోర్టర్లు బాల్ రెడ్డి/గణేష్.