అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య
సూర్య బిక్కనూర్ : మండలంలోని బస్వాపూర్ గ్రామ శివారులో ఉన్న చెరువులో ఆదివారం దేవ్‌సోత్ మారోని,(55) అనే మహిళ అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు భరించలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై అనిల్ చెప్పారు..మారోని కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఎన్ని ఆస్పత్రులు తిరిగిన వ్యాధి నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై చెప్పారు. కాగా ఇటీవల పిల్లల వివాహాలు, ఇల్లు నిర్మించడంతో చేసిన అప్పులు తీరకపోవడంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు, మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు చెరువులో గాలింపు చర్యలు చేపట్టి శవాన్ని రాత్రి బయటకు తీసి పంచనామ నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై అనిల్ తెలిపారు