బాలల హక్కుల పరిరక్షణపై కమిషన్ సభ్యురాలి పర్యటన,06, 07 తేదీల్లో ఎన్టీఆర్ జిల్లాలో పలు సంస్థల తనిఖీ
విజయవాడ, అక్టోబర్ 04, మేజర్ న్యూస్ ప్రతినిధి : రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు కె.జి. పద్మలత అక్టోబర్ 06,07 తేదీల్లో ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో బాలల హక్కుల చట్టాల అమలు, సంక్షేమ పథకాల తీరును పరిశీలించేందుకు ఆమె ఈ పర్యటన చేపట్టనున్నట్లు జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారిణి షేక్ రుక్సానా సుల్తానా బేగం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 06న అంగన్‌వాడీ కేంద్రాలు, బాలల సంరక్షణ కేంద్రాలు, స్కానింగ్ సెంటర్లు, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలను కమిషన్ సభ్యురాలు సందర్శించి పరిశీలిస్తారు. అనంతరం ప్రభుత్వ బాలుర వసతి గృహ లను తనిఖీ చేస్తారు. అక్టోబర్ 07న సంరక్షణ కేంద్రాల సిబ్బందితో బాలల హక్కులు, అభివృద్ధి, అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమలపై సమీక్షా నిర్వహిస్తారు. తరువాత కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శిస్తారు. అక్కడ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. కమిషన్ సభ్యురాలి పర్యటనలో ఎలాంటి సమన్వయ లోపాలు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగం సంబంధిత అధికారులను ఆదేశించింది. కేటాయించిన విధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది
. (ప్రేమ్ రాజ్✍️) :