వైద్యులు నిర్లక్ష్యం వల్ల పాప చనిపోయిందని బంధువుల ఆందోళన..
సీతమ్మధార అక్టోబర్ 4 మేజర్ న్యూస్ ; వైద్యుల నిర్లక్ష్యం వల్ల తమ పాప చనిపోయిందని బంధువులు ఆందోళన చేపట్టారు. గాంధీ నగర్ లో గల సునీత హాస్పిటల్ సుధా అనే గర్భిణీ శ్రీ శనివారం సాయంత్రం హాస్పిటల్ లో జాయిన్ అయినట్టు డెలివరీ నిమిత్తం ఆదివారం మధ్యాహ్నం పాప కొట్టిందని కేకలు కూడా వేసిందని మరికొద్ది క్షణాల్లోనే పాప చనిపోయినట్లు వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు బంధువులు హాస్పిటల్ వద్ద వైద్యులు నిర్లక్ష్యం వల్లే తమ పాప చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ద్వారకా పోలీసులు చొరవ చూపించి ఆందోళన బంధువులను సర్ది చెప్పారు. చనిపోయిన పాప కేవలం వైద్యుడు నిర్లక్ష్యంతోనే చనిపోయినట్లు బంధువులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేపడుతున్నారు. దీనిపై సునీత హాస్పిటల్ డాక్టర్ జి వి రావు వివరణ కోరగా గర్భిణీ స్త్రీ సుధా వైస్ 23 సంవత్సరాలు శనివారం సాయంత్రం హాస్పిటల్లో జాయిన్ అయినట్లు తమ వైద్యులు చిల్డ్రన్ డాక్టర్ తోనే డెలివరీ చేయడం జరిగిందని పుట్టిన పాప చనిపోవడం దురదృష్టకరమని అయితే ఇందులో వైద్యులు నిర్లక్ష్యం ఏ మాత్రం లేదని చేయవలసిన వైద్యం చేసినట్లు ఆయన తెలిపారు.