BREAKING
నేటి రాశి ఫలాలు: 5 అక్టోబర్ 2026, సోమవారం నేటి పంచాంగం: 5 అక్టోబర్ 2026, సోమవారం. 'జియోనిజం ఒక జాతి వివక్ష' అంటూ బ్రిటన్ గ్రీన్ పార్టీ తీర్మానం టెర్మినల్ టు యానం..అంతా మాఫియా ఈ నెల 5న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇరాన్ చమురు మంత్రి మొహ్సిన్ పాక్నెజాద్ రాజీనామా 'స్పేస్‌ఎక్స్ ఏఐ' పేరును 'స్పేస్‌ఎక్స్ ఎస్ఐ'గా మార్చనున్న ఎలన్ మస్క్ గణపతి నిమజ్జన కార్యక్రమంలో లడ్డూ వేలం పాటలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్.. సొంత గడ్డపై సత్తా చాటిన గుడిలోవ విద్యార్థులు... విజ్ఞాన్ గ్రాండ్ ఫిక్స్ - సెషన్ 1లో ప్రతిష్టాత్మక అవార్డులు...... రష్యా ఆక్రమిత ఒలేష్కీలో డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా వైద్యులు నిర్లక్ష్యం వల్ల పాప చనిపోయిందని బంధువుల ఆందోళన.. దుర్గాదేవి నవరాత్రులకు ముహూర్తపు రాట బాలల హక్కుల పరిరక్షణపై కమిషన్ సభ్యురాలి పర్యటన అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

నాణ్యమైన తాగునీరందించడమే లక్ష్యం..

Select Suryaa Now
నాణ్యమైన తాగునీరందించడమే లక్ష్యం..

నాణ్యమైన తాగునీరందించడమే లక్ష్యం.. 

రూ.150 కోట్లతో శాశ్వత పరిష్కారం

యనమలకుదురులో 23,తాడిగడపలో 7 సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం

రోడ్ల నిర్మాణంతో మారనున్న రూపురేఖలు

పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ 

తాడిగడప, అక్టోబర్ 4, మేజర్ న్యూస్ ప్రతినిధి (ప్రేమ్ రాజ్✍️) : తాడిగడప మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, యనమలకుదురు మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.150 కోట్లతో భారీ ప్రాజెక్టు చేపట్టనున్నామని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని యనమలకుదురు, తాడిగడప గ్రామాల్లో హెచ్ఏఎం పథకం కింద రూ.11.8 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. యనమలకుదురులో రూ.7.50 కోట్లతో 23 సిమెంట్ రోడ్లు, తాడిగడపలో రూ.3.80 కోట్లతో 7 సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామని, మిగిలిన మట్టి రోడ్లను దశలవారీగా సిమెంట్ రోడ్లుగా మార్చనున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్లలో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి వంటి మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. యనమలకుదురులో సుమారు 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పైప్‌లైన్లు పాతబడిపోవడంతో మంచినీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా రూ.150 కోట్లతో కొత్త పైప్‌లైన్లు, వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసి కృష్ణా నది జలాలను ప్రజలకు అందించనున్నామని వెల్లడించారు. దీనికి సంబంధించిన డీపీఆర్ ఇప్పటికే ప్రభుత్వానికి చేరిందని, త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి రాబోయే రెండున్నరేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అప్పటి వరకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృష్ణా నది నుంచి మూడు బోర్ల ద్వారా నీటిని తీసుకువచ్చి యనమలకుదురు కొండపై ఉన్న ప్రధాన వాటర్ ట్యాంకుకు అనుసంధానం చేసేందుకు రూ.1.25 కోట్లతో తాత్కాలిక పనులు చేపడుతున్నామని చెప్పారు. తాడిగడప మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ బలోపేతానికి అదనంగా రూ.50 కోట్ల నిధులు తీసుకువచ్చామని, అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తూ పనులు చేపట్టి ఏడాది నుంచి ఏడాదిన్నరలోపు ఎక్కువ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ యనమలకుదురు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి స్థానికుల సహకారంతో 75–80 రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపట్టామని, డొంక రోడ్లు, శివపార్వతినగర్ వంటి ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు కల్పించామని గుర్తుచేశారు. యనమలకుదురు వంతెన పనులు మిగిలిన భాగాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో ట్రాఫిక్ సమస్యకు ఉపశమనం లభించిందన్నారు. యనమలకుదురు–తాడిగడప ప్రధాన రహదారిని 7 మీటర్ల వెడల్పుతో బీటీ రోడ్డుగా అభివృద్ధి చేసే పనులకు కూడా శంకుస్థాపన చేశామని, భవిష్యత్తులో ప్రధాన రహదారులన్నింటినీ మరింత వెడల్పుగా, నాణ్యంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కృష్ణా నది పక్కనే ఉన్నప్పటికీ అధిక టిడిఎస్ ఉన్న నీటిని ప్రజలు తాగాల్సిన పరిస్థితి ఉండకూడదని, స్వచ్ఛమైన, నాణ్యమైన తాగునీరు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని బోడే ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో రాబోయే పది నుంచి పన్నెండు సంవత్సరాల్లో తాడిగడప మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.