BREAKING
అనుమతులు ఘనం.. బిల్లులు శూన్యం బీవీసీలో భట్లపాలెం నందు యువజన ఉత్సవాలు.. గోవింద నామస్మరణతో మార్మోగిన వాడపల్లి వెంకన్న ఆలయం మోడరన్ హైస్కూల్ లో ఆకట్టుకున్న రోబోటిక్స్ శిక్షణా కార్యక్రమం నగరంలో అంగన్వాడి ఉత్సవ్ వేడుకలు సైన్స్ ఎగ్జిబిట్స్‌పై విద్యార్థుల్లో ఆసక్తి పెంపు. నేటి రాశి ఫలాలు: 4 అక్టోబర్ 2026, ఆదివారం.. నేటి పంచాంగం: 4 అక్టోబర్ 2026, ఆదివారం మృతుల కుటుంబాలకు బిఆర్ఎస్ ఆర్థిక సహాయం కళ్యాణదుర్గం టి - సర్కిల్ అభివృద్ధి పనులకు శ్రీ కారం. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి నెక్కొండలో ఉపేందర్ హాస్పిటల్ పై అధికారుల దాడి అర్హులైన పట్టభద్రులు ఫారం- 18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి హనుమకొండ ఆర్టీసీ డిపోలో ఎన్నికల ప్రచారం కళ్యాణదుర్గం కొల్లాపూరమ్మ ఆలయం లో చోరీ.

ముంగండ - ఇసుకపూడి రహదారి పనులు వేగవంతం

Select Suryaa Now
ముంగండ - ఇసుకపూడి రహదారి పనులు వేగవంతం

పి. గన్నవరం: మేజర్ న్యూస్ :పి. గన్నవరం  ముంగండ నుండి ఇసుకపూడికి వెళ్లే రహదారి నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. దాదాపు ₹1.70 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ బీటీ (BT) రోడ్డు నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ భూమిపూజ చేసి అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాకాలంలో గుంతలమయమై తీవ్ర ఇబ్బందులు పడుతున్న ముంగండ, ఇసుకపూడి గ్రామాల ప్రజల ప్రయాణ కష్టాలను తీర్చడమే లక్ష్యంగా ప్రాధాన్యత క్రమంలో ఈ రహదారి పనులను చేపట్టినట్లు తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లకు, సంబంధిత అధికారులకు సూచించారు.
రహదారి పనులు ప్రారంభం కావడంతో ముంగండ, ఇసుకపూడితో పాటు పరిసర గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.